AP 39 TV 26 మార్చ్ 2021:
రైతు వ్యతిరేక చట్టాలు,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కి మద్దతుగా ఎస్కేయూనివర్సిటీ లో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేసి బంద్ ని పర్యవేక్షించడం జరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ కి సహకరించి విధులకు గైర్హాజరు కావడం.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని,అందులో భాగమే రైతు వ్యతిరేక చట్టాలు,విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ వంటి అనాలోచిత నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించే చర్య అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కి హెచ్చరిస్తున్నాం.బంద్ సందర్బంగా ఎస్కేయు లో బైక్ ర్యాలీ నిర్వహించి,అనంతరం ముఖద్వారం వద్ద అర్ద నగ్నంగా నిరసన తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో జయచంద్రరెడ్డి, అంకె శ్రీనివాసులు,హేమంత్ కుమార్,హర్షవర్ధన్,తిరుపాల్ నాయక్,సునీల్ కుమార్ యాదవ్, మారుతి, అజయ్ కుమార్,చంద్ర శేఖర్, హరీష్, వివేకానంద, షాదిక్, నవీన్, నరేష్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.