Header Top logo

బ్రిటిష్ వాళ్ల గుండెల్లో బాంబులా పేలిన భగత్ సింగ్

బ్రిటిష్ వాళ్ల గుండెల్లో

భగభగమండిన భగత్ సింగ్

” అవ్ నాన్నా..
మనం ఈ విత్తనాలు ఎందుకు తీసుకు పోతున్నం..” – అంటూ ఎడ్లబండిపై తన తండ్రితో వెళ్తున్న ఆ చిన్నోడు అమాయకంగా ప్రశ్నించాడు.

 

” ఏం లేదురా.. ఈ కొన్ని విత్తనాలు వేస్తేనే గోధుమ పంట పండుతుంది. పంట నుంచి మనకు తినడానికి.. మళ్లీ పంట వేసుకోవడానికి కావాల్సిన గోధుమలు వస్తాయి..” అంటూ ఆ తండ్రి ఆ చిన్నోడికి వివరించాడు.

తెల్లారి మళ్లీ అలాగే తమ చేనులోకి వెళ్లారు.. ఆ తండ్రీ కొడుకులు.

తండ్రి ఓవైపు గోధుమ విత్తనాలు వేస్తున్నాడు. ఇంతలో చిన్నోడు కాస్త దూరంలో ఏదో నాటుతున్నాడు.

” అరే ఏంది బిడ్డా ఇది..!?
ఇది ఎక్కడి నుంచి తెచ్చావు..!?
ఇలా ఎందుకు నాటుతున్నావు..!?
అని ఆ తండ్రి కంగారు పడ్డాడు.
ఆ పిల్లాడు మాత్రం తాపీగా మట్టి అంటిన చేతులు దులుపుకుంటూ…
” ఏం లేదు నాన్న..! నిన్న నువ్వు చెప్పావు కదా..! ఈ కొన్ని గోధుమ విత్తనాలను నాటితే మనకు తినడానికి సరిపడా పంట వస్తుందని.
ఇదిగో.. మన ఇంట్లో దొరికిన ఈ పాత తుపాకీని కూడా నాటితే రేపొద్దున.. దీనికి కూడా చాలా తుపాకులు వస్తాయి..” అంటూ అమాయకంగా జవాబిచ్చాడు.

తన కొడుకు చేసిన పనికి ఓ దిక్కు ఆశ్చర్య పడుతూనే.. “ఎందుకు బిడ్డ మనకు అన్ని తుపాకులు మరి..” అని ఆ తండ్రి అడిగాడు.

అప్పుడు ఆ చిన్నోడు …
” ఎందుకు అని అడుగుతావేంటి నాన్న..!? మన దేశాన్ని పాలిస్తున్న ఆంగ్లేయులు ఈ తుపాకులతోనే కదా.. భారతమాతను బందీగా చేశారు. మనల్ని బానిసలుగా శాసిస్తున్నారు. ఇవి మన దగ్గర కూడా ఉంటే.. వాళ్లను మనం మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టవచ్చు కదా..” అని ఆవేశంగా చెప్పాడు.

అలా ఊహ తెలియని వయసులోనే దేశ స్వాతంత్రం గురించి ఆలోచించిన ఆ చిన్నోడే..

బ్రిటిష్ వాళ్ల గుండెల్లో భగభగమండిన.. భగత్ సింగ్ .

నూనూగు మీసాల నవయవ్వనంలోనే స్వతంత్ర సమరంలో దూకిన వీరుడు.. ఆంగ్లేయుల లాఠీలు, తూటాలకు వెరువని ధీరుడు..
స్వాతంత్ర పోరాటానికి కొత్త దిశను చూపిన నాయకుడు..
భరతమాత ఒడిలో ఒదగడానికి నవ్వుతూ ఉరికంబం ఎక్కిన అమరుడు..
నాటికీ.. నేటికీ.. ఎప్పటికీ.. యువత గుండెల్లో హీరోగా నిలిచిన దేవుడు..
భగత్ సింగ్ .

రాజ్ గురు..
సుఖదేవ్..
భగత్ సింగ్..
ఇవి మామూలు పేర్లు కావు.
తలుచుకున్న క్షణమే..
అణువణువునా..
యువతలో దేశభక్తిని నింపే ప్రేరణ మంత్రాలు.

ఆ అమరవీరుల యాదిలో.. అశ్రునివాళ్లు..💐✊

– మనకు తెలుసు దేశభక్తులు అంటే ఎవరో..
కానీ మీ పిల్లలకు కూడా చెప్పండి.
రేపటి తరం కూడా ఈ వీరులను మరువద్దు.

బడి గోడలపై ఉండాల్సింది..
ప్రాణం లేని కార్టూన్ బొమ్మలు కాదు.
దేశం కోసం ప్రాణాలను సైతం..
అర్పించిన హీరోల
సజీవ చిత్రాలు..
🙏🙏✊✊

– సోషల్ మీడియా సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking