Header Top logo

Betrayal Bear “traitor” ద్రోహాన్ని ఎలుగెత్తిన “విద్రోహి”

Betrayal Bear “traitor”

మొహంజదారో మెట్ల మీది ద్రోహాన్ని
ఎలుగెత్తిన “విద్రోహి”

“చనిపోవడానికేముందీ
చే గువేరా కూడా చనిపోయాడు
చంద్ర శేఖర్ కూడా మరణించాడు
కానీ నిజమైన అర్థంలో ఎవరూ చనిపోరు
నేను జీవించినట్లు అందరూ జీవిస్తున్నారు…”

ఇది ఆ “విద్రోహి” కవిత.

“చే, చెర, కౌముది
పాష్, జారా లు
చంపబడిన వయస్సు దాటాక కూడా
ఇంకా బతికే ఉన్నందుకు
సిగ్గుగా ఉంది, పరమ కంపరంగా ఉంది”

ఒక టీ తాగాలనిపించింది

ఇది ఈ విద్రోహి కవిత. ఆ విద్రోహి గురించి విన్నప్పుడు, చదివినప్పుడు అతను బతుకుతున్న తీరు గురించి, చదువుతున్న కవిత్వం గురించి విన్నాక ఒకసారి ఈ విద్రోహి కి అతడ్ని చూడాలని పించింది. కలిసి కరచాలనం చేయాలనిపించింది. నెగడు పక్కన అతడితో కూర్చొని ఒక టీ తాగాలనిపించింది.

చలాన్ని చూడడానికి..

నన్ను ఎప్పుడూ పట్టి బంధించి ఉంచే ఆంక్షలు నా బతుకులో ఎప్పుడూ లేవు. చలం నవల “జీవితాదర్శం” చదివాక ఇక ఆగలేక చలాన్ని చూడడానికి, ఆ నవలలో వర్ణించిన సముద్రపు ఘోషని వినడానికి నా పదిహేనో యేట భీమిలి వెళ్ళాను. అప్పటికే చలం చనిపోయి చానాళ్ళయింది అని తెలుసు. ఆ ఇంట్లో ఒక్క చిక్కాల కృష్ణారావు గారు మాత్రమే వున్నారు. ఇద్దరం కలిసి చలం నడిచిన దారుల్లో నడిచాం. సౌరీస్ పాడుకున్న పాటల్ని పాడుకున్నాం. ఉన్నదేదో వండుకు తిన్నాం. ఆ కబుర్లలో, ఆ పాటల్లో చలాన్ని చూసాం.

విద్రోహిని కలిసిన క్షణం..

ఇక విద్రోహి విషయానికి వచ్చేసరికి తన గురించి విని, తన కవిత్వాన్ని చదివిన ఐదేళ్ళ తర్వాత కానీ 2009 లో వెళ్ళి కలవగలిగాను. జేఎన్యూ క్యాంపస్ ఎదురుగా ఉన్న గంగా దాబాలో తనని కలిశాను. చలి వణికిస్తున్న ఒక వేకువజామున ఒక నిప్పుకణికతో కరచాలనం చేసిన అనుభవం. ఒక పెళపెళ మండే నెగడు ముందు కూర్చున్న వెచ్చదనం. ఒక ఛా తాగి, ఒక బీడీ ఊదాకా నేను కూడా ” హమ్ బీ విద్రోహి” అని పరిచయం చేసుకున్నాను.

బీడీలు తాగి తాగీ చొట్టలు పడిపోయిన మొఖం అంతా నవ్వుతో నిండిపోయింది. “సబ్ బీ విద్రోహి” అన్నాడు. అలా రోజంతా జేఎన్యూ క్యాంపస్ లో తిరుగుతూ కవిత్వాన్ని పంచుకుంటూ తిరిగిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది. అందరిలాగే విద్రోహి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి వచ్చిన నేను మాత్రం మళ్ళీ వెళ్ళలేక పోయాను. Betrayal Bear “traitor”

విద్రోహి పేరు రామ శంకర్ యాదవ్‌

రామ శంకర్ యాదవ్‌ ‘విద్రోహి’ అసలు పేరు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో 1957 లో డిసెంబర్ 3 న పుట్టాడు. లక్నో లో ఎల్.ఎల్.బి. చదువుతూ తన విద్యార్థి రాజకీయాల వల్ల కాలేజ్ నుంచి బహిష్కరించబడ్డాడు. తర్వాత ఢిల్లీ వచ్చి జేఎన్యూ లో పీ.ఎచ్. డీ. చేసేందుకు చేరాడు. కానీ యేడాది లోపే అదే విద్యార్ధి రాజకీయాలు వల్ల జేఎన్యూ నుంచి కూడా బహిష్కరించబడ్డాడు. ఇక ఇంటికి వెళ్ళలేదు. జేఎన్యూ క్యాంపసే అతని ఇళ్ళయింది. అతని సమస్తం ఆ క్యాంపస్, ఆ విద్యార్థులే అయ్యారు. అతను తాగే బీడీలు, టీ నుంచీ బట్టలు అన్నీ ఆ విద్యార్థులే సమకూర్చేవారు. క్యాంపస్ లో గోడలు లాగా, చెట్లు లాగా, తరగతి గది లాగా అతడు ప్రతీఒక్కరికీ పరిచితుడే.

రామ శంకర్ యాదవ్‌ లాగే అతడి ధిక్కార కవిత్వమూ పరిచయమే. అతను ఆ ఎదురుగా వుండే గంగా డాబాలో అతడూ ఒక భాగమైపోయాడు. అక్కడి రాళ్ళ బల్లల మీద కూర్చొని కవిత్వం చెప్పేవాడు. అతడు ఎప్పుడూ ఒక్క వాక్యాన్ని కూడా కాగితం మీద కలంతో రాయలేదు. అన్ని ప్రాపంచిక వాంఛలకూ అతీతంగా విద్యార్థులతో కలిసి వసతిని పంచుకుంటూ బతికాడు. అలా ముప్పై ఏళ్ళ పాటు ప్రతీ విద్యార్థి ఆందోళనలోనూ అతడూ, అతడి కవిత్వం భాగమైపోయాడు. హిందీ-అవధీ భాషల్లో అలవోకగా కవిత్వం చెప్పేవాడు. Betrayal Bear “traitor”

“మేరా సర్ ఫోడ్ దో,
మేరీ కమర్ తోడ్ దో,
పర్ యే నా కహో
కి అప్నా హక్ చోడ్ దో.”

నా తల పగలగొట్టండి,
నా వీపును విరగొట్టండి,
కానీ,నా హక్కులను విడిచిపెట్టమని మాత్రం
నన్ను అడగవద్దు.

నేను అతనిని కలిసినప్పుడు ఆలీవ్ గ్రీన్ కలర్ ప్యాంటు ధరించి, చిరిగిపోయిన భారీ చొక్కాతో పొట్టిగా ,చిన్నగా కనిపించాడు. 50 ఏళ్లకే ముసలితనం అతడ్ని అక్రమించుకున్నట్టు కనిపించాడు. నేను అతడితో ఉన్నంతసేపూ తన కవితలలో ఒకదాన్ని హమ్ చేస్తూనే వున్నాడు .అతని చేతులు రెండు పెద్ద ఊహాజనిత వలయాల్లో గాలిలో కదులుతున్నాయి -తన ఎదుట కిక్కిరిసిన ప్రేక్షకులు ఉన్నట్టు.. అతను తనను తాను ప్రదర్శిస్తున్నట్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అతను గట్టిగా ఎలుగెత్తి చెబుతూనే ఉన్నాడు.

“మైం
కిసాన్ హున్ ఆస్మాన్ మే ధాన్ బో రహా
హున్ కుచ్ లోగ్ కెహ్ రహే హైం
కీ పగ్లే! ఆస్మాన్ మే ధాన్ నహీం జమా కర్తే
మైం కెహతా హున్ పగ్లే!
అగర్ జమీన్ పర్ భగవాన్ జామ్
సక్తే హైం తో ఆస్మాన్ జామేతో!”

నేను ఒక రైతుని
ఆకాశంలో విత్తనాలు నాటుతున్నానని
కొంతమంది అంటున్నారు
ఒరేయ్ పిచ్చోడా! మీరు ఆకాశంలో గోధుమలను
సేకరిస్తారు ఓ వెర్రివాడా!
దేవతల్ని భూమిపైకి దించగలిగితే
ఆకాశంలో గోధుమలు పెరుగుతాయి.

విద్రోహి 2015 డిసెంబర్ 8 వ తేదీన యు.జి.సి. ఆదేశాలకి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటూ గుండెపోటుతో తన ప్రియమైన నగరం ఢిల్లీలో మరణించాడు.

“అతను లేకుండా మా నిరసనలు, మా నడకలు మా జీవితాలు అసంపూర్ణంగా ఉంటాయి. మొత్తం విద్యార్థి సమాజం అతనిని కోల్పోయారు,” అని విద్యార్థులు ఇప్పటికీ తల్చుకుంటారు. గోడ మీద రాతల్లోనో, విద్యార్థుల నినాదాల్లోనో అతను ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాడు.
“విద్రోహి మరణించాడు, కానీ అతని ఆలోచనలు కవిత్వం బతికే ఉన్నాయి.”

ఢిల్లీ వెళ్లినప్పుడల్లా షాహీన్ బాగ్ శిబిరంలోనో, రాజధానిని ముట్టడించిన రైతుల మధ్యో కూర్చొని కవిత్వం చదువుతూ నాకు “విద్రోహి” కనిపిస్తూనే ఉంటాడు. సొట్టబోయిన బుగ్గలతో నవ్వుతూ తలవూపుతూనే ఉంటాడు. మొహంజదారో మెట్ల మీద

-విద్రోహి

1.

నేను సైమన్ న్యాయస్థానం రేవులో నిలబడి ఉన్నాను. పురుషులు, ప్రకృతిని నాకు సాక్షులుగా ఉండనివ్వండి!

నేను మొహెంజదారోలోని చెరువు చివరి మెట్ల మీద నిలబడి మాట్లాడుతున్నాను.
ఒక మహిళ మండుతున్న శవం ఎక్కడ ఉంది?
అక్కడ అనేక మానవ ఎముకలు తేలతాయి.

మీరు ఈ మండుతున్న శవాన్ని
బాబిలోనియాలో కూడా కనుగొంటారు.
మీరు మెసొపొటేమియాలో కూడా చెల్లాచెదురుగా ఉన్న మానవ ఎముకలను కనుగొంటారు.
నేను ఎందుకు నిరంతరం ఆశ్చర్యపోతున్నాను? నేను తప్పకుండా ఆశ్చర్యపోతూనే ఉంటాను
పురాతన నాగరికత పునాదుల్లో
ఒక మహిళ మండుతున్న శవం
కాసిని మానవ ఎముకలతో
నాగరికత ప్రారంభమవుతుంటే
ఏది కొనసాగుతుంది అని నేను ఆశ్చర్యపోతూనే ఉంటాను.
స్కైథియా రాళ్ల నుండి బెంగాల్ పొలాల వరకు
సమనా అరణ్యం నుండి కన్హా అడవుల వరకు
విస్తరించి ఉంది ఏమిటీ?

2.

ఈ స్త్రీ తల్లి కావచ్చు,
ఒక సోదరి కావచ్చు
ఒక భార్య కావచ్చు
ఒక కుమార్తె కావచ్చు

నేను మీకు చెప్తున్నాను,
నా దృష్టి నుండి బయటపడండి.
నా రక్తం ఉడికిపోతోంది,
నా గుండె పాడుతుంది,
నా చర్మం కందిపోతుంది.
నా తల్లిని, నా చెల్లిని, నా భార్యను, నా కూతుర్ని చంపేశారు.
నా ఆడ పూర్వీకులంతా ఆకాశంలో విలపిస్తున్నారు.

నేను ఈ స్త్రీమండుతున్న శవానికి
వ్యతిరేకంగా నా తలను బద్దలు కొట్టుకోగలిగాను
నా జీవితాన్ని నడి బజారులో వదులుకున్నాను
నాకు కుమార్తె ఉంటే ఆమె నాకు తప్పక చెబుతుంది:
పాప్పా, మీరు ఏమీ లేకుండా ఆడపిల్లల గురించి చింతించండి.
మేం వంటల పొయ్యి వెలిగించడానికి పుట్టిన
కట్టెలం మాత్రమే!

బహుశా ఈ ఎముకలు
రోమన్ బానిసలవి లేదా బెంగాల్ నేత కార్మికులువి
లేదా వియత్నాం, పాలస్తీనా, ఇరాక్ నుండి
వచ్చినవి కావచ్చు.

రోమన్ ,బ్రిటిష్ లేదా సరికొత్త అమెరికన్
సామ్రాజ్యం అనేది ఒక విధ్వంసక పనిముట్టు
దీనికి కేవలం ఒక పని మాత్రమే ఉంటుంది
మానవ ఎముకలను చెదరగొట్టడానికి
పర్వతాలు, పీఠభూములు ,పొలాలు, నదులు, సముద్ర తీరాలలో చరిత్రల, నాగరికతల ఆనవాళ్లని
చూపించి యాత్రా స్థలాలుగా చేయడం.

వాళ్ళు చరిత్రను ముచ్చటగా మూడు వాక్యాలలో నిర్వచించించేశారు.
చూడండి, మనం ప్రపంచాన్ని వెలిగించాము.
చూడండి, మేము భూమిని కాల్చాము.
చూడండి, మన దగ్గర మనుషుల ఎముకల పోగులు ఎక్కడికక్కడే గుట్టలుగా ఉన్నాయి.

కానీ నేను స్పార్టకస్ వారసుడ్ని
అతని సంకల్పం నాకు ఉంది.
వెళ్లి సీజర్‌కి చెప్పండి, మేము సమావేశమవుతున్నాం
ప్రపంచంలోని అందరు బానిసలం
ఏదో ఒక రోజు కలిసి కట్టుగా రోమ్‌లోకి ప్రవేశిస్తాము.

లేదు, మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు
ఎందుకంటే ఈ క్షణంలో
నేను మీకు నా కవితను చదివి వినిపించాను.
లాటిన్ అమెరికన్ కార్మికుడు
గొప్ప సామ్రాజ్యపు సమాధిని త్రవ్వపారేస్తాడు.
భారతీయ కార్మికుడు తన పెంపుడు ఎలుకల బొరియలను నీటితో నింపేస్తాడు.

రగులుతున్న అగ్ని ఆసియా నుండి ఆఫ్రికా వరకు వ్యాపిస్తుంది
చల్లార్చడం సాధ్యం కాదు, మిత్రమా!
ఎందుకంటే ఈ అగ్ని ఒక మహిళ మండుతున్న శరీరానిది.
ఎందుకంటే ఈ అగ్ని భూమిపై చెల్లాచెదురుగా ఉన్న మానవ ఎముకలపొగుతో రగిలించబడింది.

3.

చరిత్రలో తొలిసారి ఓ మహిళ హత్యకు గురైంది
ఆమె కొడుకు చేతిలో ,తన తండ్రి కోరిక మేరకు.
జమదగ్ని అంటాడు,
‘పరశురామా, నేను నీతో చెప్తున్నాను, వెళ్ళి నీ తల్లిని చంపు’
పరశురామూడు ఆ ఆజ్ఞని పాతించాడు.
ఇలా కొడుకు తండ్రికి చెందుతాడు.
పితృస్వామ్యం ఇలా మొదలవుతుంది.

తర్వాత తండ్రులు కొడుకులను చంపడం మొదలుపెట్టారు.
జాహ్నవి తన భర్తతో ‘ నా పిల్లలను గంగలో ముంచివేయి’ అని అడిగింది
శంతనరాజు దాన్ని పాటించాడు

కానీ శంతను మాత్రం జాహ్నవికి
ఏమీ కాలేకపోయాడు
ఎందుకంటే రాజు ఎవరికీ చెందినవాడు కాదు
ఎందుకంటే సంపద ఎవరికీ చెందదు
ఎందుకంటే మతం ఎవరికీ చెందదు.

అయినా, అంతా రాజుకే చెందుతుంది
ఆవు, గంగ, గీత , గాయత్రి,
దేవుడుతో పాటు రాజు గుర్రాలను నిర్ధారిస్తాడు
అవి నమలడానికి తగినంత గడ్డిని కలిగి ఉంటాడు.

అతను మంచి సహచరుడు,
ఈ దేవుడు పూర్తిగా రాజుకు అంకితం అయ్యాడు.
అతను చాలా కాలం క్రితం చనిపోయాడు, పాపం.
రాజు అతనికి ఒక కవచం లేదా రెండు చదరపు అడుగుల భూమి కూడా ఇవ్వలేదు ఖననం కోసం
అతను ఎక్కడ పాతిపెట్టబడ్డాడో ఎవరికీ తెలియదు.

అయినప్పటికీ, దేవుడు చివరికి మరణించాడు
అది ఒక చారిత్రక సంఘటన,
చరిత్రకారులు భారీ గ్రంథాల్లో నిర్వచిస్తారు.
రాజు కూడా మరణించాడని చరిత్రకారులు కూడా అభిప్రాయపడ్డారు
రాణి కూడా, వారి కొడుకు కూడా.
రాజు కూడా యుద్ధంలో మరణించాడు,
వంటగదిలో రాణి , యువరాజు తన వారసత్వపు
కాగితాల్ని కాల్చివేశారు.

రాజు మంజూరు చేసిన సంపద అలాగే ఉండిపోయింది , అది విస్తరించింది.

మళ్ళీ, మేము అన్ని నాగరికతల
పునాదులకు తిరిగి వస్తాము
ఒక మహిళ యొక్క మండుతున్న శవాన్ని, చెల్లాచెదురుగా ఉన్న ఎముకలను కనుగొంటాం.

4.

ఈ శరీరం తనంతట తానే కాలిపోలేదు
ఎవరో నిప్పంటించారు.
ఈ ఎముకలు కేవలం చుట్టూ విస్తరించి ఉండవు ఎవరో వాటిని చెదరగొట్టారు.
ఈ అగ్ని తనంతట తానే రాజుకున్నది కాదు
ఎవరో వెలిగించారు.
ఈ యుద్ధం ఆకస్మికంగా ప్రారంభం కాలేదు
ఎవరో ప్రారంభించారు.

ఈ పద్యం కూడా ఏ లిపీ లేదు
ఈ పద్యం రాయబడలేదు కూడా!

ఒక పద్యం రాస్తే,
ఒక నెగడు రగులుతుంది.

నా ప్రజలారా!
ఈ అగ్ని నుండి నన్ను రక్షించమని
నేను మిమ్మల్ని అడుగుతున్నాను.

ఈ అగ్ని నుండి నన్ను రక్షించండి,
తూర్పు నుండి నా స్నేహితులు
దీన్నీ విస్తారమైన తమ పొలాల్లో
కత్తులతో సాగు చేస్తారు
వీరి పంట రథాల చక్రాల కింద నలిగిపోయింది.

ఈ అగ్ని నుండి నన్ను రక్షించండి,
పశ్చిమ దేశాల నుండి నా స్నేహితుల
తాలూకూ స్త్రీలు బజారులో అమ్మబడతారు
వీరి పిల్లలను చిమ్నీ మంటలకి తినిపిస్తారు.

ఈ అగ్ని నుండి నన్ను రక్షించండి,
ఉత్తరాది నుండి వచ్చిన నా స్నేహితులు
తమ పూర్వీకులు పర్వతాలను మోయవలసి వచ్చింది
అప్పుడు వారి వీపులు విరిగిపోయాయి.

ఈ అగ్ని నుండి నన్ను రక్షించండి,
సుదూర దక్షిణం నుండి నా స్నేహితుల
నివాసాలు అడవి మంటల్లో కాలిపోయాయి,
వీరి పడవలు అట్టడుగు సముద్రాల్లో మునిగిపోయాయి.

మీరు, మీరందరూ, ఎవరి రక్తంతో, చెమటతో
నిర్మించిన పిరమిడ్లు, మినార్లు, గోడలు లోకి
నన్ను బట్వాడా చేయండి.

ఆ శవంగా ఉన్న స్త్రీని ప్రసవించనీయండీ
మొహెంజో-దారోలోని చెరువు చివరి మెట్లపై.
సరస్సులో ఎముకలు తేలుతున్న వారిని విడిపించడానికి నన్ను విడిపించుకోవాలి.

మీ పూర్వీకులను రక్షించడానికి నన్ను రక్షించండి.
మీ పిల్లలను రక్షించడానికి నన్ను రక్షించండి.

నన్ను సజీవంగా పాతిపెట్టండి
ఎందుకంటే – నేను మీ కవిని!

(03 – 11 – 21 విద్రోహి జయంతి ఓ జ్ఞాపకం కలచి, నాలాంటి వాడినే తలచి ,వాడిలో నిలువునా తడిచి) Betrayal Bear “traitor”

  • జె.వి.ఎన్. మూర్తి, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking