Header Top logo

Batukamma on social media దుబాయ్ బతుకమ్మ వైరల్

    1. Batukamma on social media

సోషల్ మీడియాలో వైరల్ దుబాయ్ బతుకమ్మ

బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ బుర్జ్ ఖలీఫా టవర్స్ పై బతుకమ్మ సంబరాలు నిర్వహించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ సంస్కృతిని దునియాకు చాటి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ప్రతి ఏడు తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో బతుకమ్మతో పాటు తెలంగాణ పండుగలు జరుపుతున్నారు. అయితే.. శనివారం దుబాయ్ బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మతో పాటు బతుకమ్మ, జై తెలంగాణ, సీఎం కేసీఆర్, తెలంగాణ జాగృతి అంటూ బుర్జ్ ఖలీఫా స్క్రీన్ (తెర) పై లేజర్ షో ప్రదర్శించడాన్ని లక్షలాది మంది తిలకించారు. ( Batukamma on social media ) దుబాయ్ బతుకమ్మ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

KAVITHA 22

కవితక్కా.. మా బాధలు పట్టించుకో

బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన తమ సమస్యలను పట్టించుకోవడం లేదని బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరిక అలాగే ఉంది. డెభ్బైనుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి బుర్జ్ ఖలీఫా బతుకమ్మను ప్రదర్శించిన కవితక్కా మా సమస్యలను తీర్చాండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు  దుబాయ్ లోని లేబర్ క్యాంపులు తిరిగి సమస్యలను తెలుసుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.  తమతో సహాఫంక్తి బోజనాలు చేసి గల్ఫ్ నా ఎనిమిదవ సెగ్మెంట్ అని చెప్పిన విషయాన్ని గల్ఫ్ అసోషియేషన్ ప్రతినిధి మంద భీంరెడ్డి ఎమ్మెల్సీ కవితకు గుర్తుకు చేశారు.

భీంరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇదే

  • కవితక్క గారి దుబాయి బతుకమ్మ సంబరాలు: ఎడారిలో ఎండిపోయిన, చిన్నబోయిన గల్ఫ్ బతుకులకు భరోసా ఇవ్వాలని ఆశిద్దాం !
  • ఎడారిలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయి లోని బుర్జ్ ఖలీఫాపై మీరు నిర్వహించిన బతుకమ్మ సంబరాల వెలుగు నీడలో… అధఃపాతాళం లో ఉన్న గల్ఫ్ కార్మికుల బతుకులు ఎండమావుల నుండి ఒయాసిస్సుల వైపు సాగాలని ఆశిద్దాం !
  • కవితక్క ప్రేమగా పిలుచుకునే ఎనిమిదో నియోజకవర్గం ‘గల్ఫ్’ గురించి అయినా… తెలంగాణ ఎన్నారై మంత్రిగా బాధ్యతలు చేపట్టి గల్ఫ్ వలస కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం !
  • నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలలో ఓడించిన మీ ఎనిమిదో సెగ్మెంట్ ‘గల్ఫ్’ పై కోపం పెట్టుకోకుండా కవితక్క పాజిటివ్ గా, స్పోర్టివ్ గా వ్యవహరించాలని ఆశిద్దాం !
  • Batukamma on social media

ప్రపంచంలోనే ఎత్తయిన కట్టడం, ఆకాశహర్మ్యం దుబాయి లోని బుర్జ్ ఖలీఫా. దీని నిర్మాణంలో భారత్ తో సహా ఆసియా దేశాల కార్మికులు, మన తెలంగాణ కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయి.  నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?  అనే మాటలు గుర్తుకు వస్తున్నాయి.

గల్ఫ్ దేశాలలోని రంగు రంగుల ఆకాశ భవనాల నిర్మాణం వెనుక మన తెలంగాణ కార్మికుల కష్టం ఉన్నది. ఈ నిర్మాణాల పునాదులు మన కార్మికుల చెమటతో తడిశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గల్ఫ్ ప్రవాసీల పాత్ర అమోఘం. గుర్తింపుకు నోచుకోని అజ్ఞాత వీరులు, అజ్ఞాత శిల్పులైన మన ప్రవాసీ కూలీలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. భారత దేశంలోని ముఖ్యమైన ఏ ప్రాజెక్టు నిర్మాణంలో అయినా మన పాలమూరు కూలీల పాత్ర ఉన్నది. గల్ఫ్ దేశాలలోని ఏ నిర్మాణం అయినా భారతీయ కూలీలు, ముఖ్యముగా తెలంగాణ కార్మికుల శ్రమతోనే పూర్తి అయినవి అని చెప్పవచ్చు. (Batukamma on social media)

తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు గల్ఫ్ దేశాలలో సుమారు 1,400 కు పైగా తెలంగాణ కార్మికులు మరణించారు. అంతకు ముందు 2,000 కు పైగా మరణించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానన్న కేసీఆర్ హామీని అమలు చేయడానికి కవితక్క కృషి చేస్తారని ఆశిద్దాం ! ఒక అంచనా ప్రకారం.  భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అత్యధిక గల్ఫ్ వలస కార్మికులు ఉన్న నియోజకవర్గం  నిజామాబాద్. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

Batukamma on social media

మంద భీంరెడ్డి,  98494 22622

Leave A Reply

Your email address will not be published.

Breaking