AP 39TV 09ఏప్రిల్ 2021:
పేదల పక్షపాతి అనంత కరుణామయుడు,అనంత ప్రజల దేవుడు, అనంతపురం జిల్లా ప్రజల పాలిట కల్పవృక్షం అయిన RDT (రూరల్ డౌలెప్మెంట్ ట్రస్ట్) సంస్థ వ్యవస్థాపకులు డా౹౹ విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ 101 వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని నేషనల్ పార్కు నందు ఉన్న డా౹౹ విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభాకర చౌదరి మరియు జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ మాజీ రాష్ట్ర యాదవ కార్పొరేషను డైరెక్టరు నారాయణ స్వామి, యాదవ్ నగర మహిళా అద్యక్షురాలు విజయశ్రీ, నగర మైనార్టీ అద్యక్షుడు గౌసు, నగర sc విభాగం అద్యక్షుడు బంగి నాగ మేకల వెంకటేష్ గౌడు, గంగవరం బుజ్జి సరిపూటి శ్రీకాంత్, బాబా ఫక్రుద్దిన్, తాహిర్ మున్న, కార్తీక్, మనేమ్మ, వసుంధర, ఫక్రున్ని, రామాంజనేయులు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.అవే సంస్థ వ్యవస్థాపకులు ప్రభాకర చౌదరి మాట్లాడుతూ అనంతపురం జిల్లా నందు 1969 సంవత్సరంలో ఆర్.డి టి సంస్థ సేవా కార్యక్రమాలు ప్రారంభించి, అప్పటినుండి దళిత, గిరిజన ,వెనుకబడిన తరగతుల వారికి, దివ్యాంగులకు , మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, విద్యార్థులకు విద్య ,వైద్యం ,ఇల్లు ,వ్యవసాయ అభివృద్ధి, మహిళా సంఘాల అభివృద్ధి ,క్రీడలకు అటువంటి ఎంతో మందికి ఆర్డిటి సంస్థ అండగా ఉండడం జరిగిందన్నారు. ఆర్.డి.టి స్థాపించి 50 సంవత్సరములు పూర్తి చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మన్నలను పొందడం జరిగిందని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని పేర్కొన్నారు.