AP 39TV 09ఏప్రిల్ 2021:
అనంతపురం నగరంలోని జెఎన్టీయు స్ట్రాంగ్ రూం మరియు కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి గార్డు, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని అక్కడి సిబ్బందికి సూచించారు. స్ట్రాంగు రూం పరిసరాలలో ఏర్పాటు చేసిన సిసీ కెమేరాలను పరిశీలించారు. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతపురం డిఎస్పి జి.వీరరాఘవరెడ్డి, పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, తదితరులు జిల్లా ఎస్పీతో పాటు వెళ్లారు.