Header Top logo

సీఎం జగన్ ను దూషించిన ఏఆర్ కానిస్టేబుల్

ఏఆర్ కానిస్టేబుల్ కు బెయిల్

మనిషి ఆలోచన ఎలా ఉంటే అలాగే ప్రవర్థన ఉంటుంది. ఇగో.. కోపంలో సీఎం జగన్ ను దూషించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులకు కోపం వచ్చింది. అంతే.. సీఎంను దూషించిన ఏఆర్ కానిస్టెబుల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ హైవే మొబైల్ వెహికల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వరరావు సీఎంను దూషించారని నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను జగ్గయ్యపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంకటేశ్వరరావు విధుల్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి పోలీసుల జీతాల గురించి ప్రస్తావించారు. ఇదే విషయంపై ఆయన సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో పోలీసులకు చేరడంతో చర్యలకు ఉపక్రమించారు.

కోర్టు ఏఆర్ కానిస్టేబుల్ కు బెయిల్ మంజూరు చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking