Header Top logo

గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్

గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు

స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్

సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్ కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్ లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు.

సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎపి భవన్ ప్రత్యేక కమీషనర్ గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు.

టిటిడి ఇఓగా పలు సంస్కరణలకు బీజం వేసారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్ గా అయా జిల్లాలలో తనదైన ముద్ర వేసారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కెఆర్ పురంలలో , సబ్ కలెక్టర్ గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్ గా వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking