AP 39 TV 21 ఫిబ్రవరి 2021:
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి -ఏపీ జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి.నెల23,24 తేదీలలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి,అనంతపురం,కదిరి ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారు.జిల్లా జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆయన కృషి చేస్తారు. ఇటీవల ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసిన జర్నలిస్టుల శిక్షణా తరగతులలో పాల్గొన్న మిత్రులకు సర్టిఫికెట్ రాని వారికి అనంతపురం ప్రెస్ క్లబ్ లో 23 వ తేదీన వివరాలు తీసుకొని అంద చేయడం జరుగుతుంది. ఈ నెల 23న అనంతపురం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరుగుతుంది.అనంతపురం ప్రెస్ క్లబ్ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ముద్రించిన పుస్తకాలు ఇతర సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది. కావున జిల్లాలో పనిచేసే ప్రింట్ మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,చిన్న పత్రికల ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్లు,సబ్ ఎడిటర్లు పాల్గొని విజయవంతం చేయండి,మచ్చా రామలింగారెడ్డి ఏపీ జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు.