Header Top logo

All the answers the cats on the wall. Poetry కవిత్వం

All the answers the cats on the wall

*జవాబులన్నీ.. గోడ మీది 🐱 🐈 పిల్లులే.!!

ఇప్పుడు ప్రశ్నలన్నింటికీ
జవాబొక్కటే…!
ఆగిపోతున్న ఊపిరిలకు
కారణమూ ఒక్కటే.!

ఎండిన ఆకులు
రాలుతాయని తెలుసుకానీ..
ముక్కుపచ్చలారని చిగుర్లు
రాలుతున్నాయేం చెప్మా!

నూరేళ్ళ ఆయుష్షు కు
ఎలాగూ భరోసా లేదు
ఇక ఆవిరౌతున్న ఆశలకు
ఆసారా ఏదీ….!

కొండెక్కుతున్న దీపాలకు
చమురు పోసే వాడెవడు?
మండుతున్న బతుకులను
నీళ్ళుపోసి ఆర్పేవాడెవడు?

గేయాలు గాయాలనుంచి
పుడతాయని తెలుసు కాని
జీవితమే మానని గాయమై
నిత్య శోకగీతమైందేమిటీ?

ఇప్పుడు ప్రశ్నలన్నీ బారులుకట్టే
చీమల 🐜🐜🐜 పుట్టలు
జవాబులు………….
గోడ మీది 🐱 🐈🐈 పిల్లులు.!!

ఎ.రజాహుస్సేన్.!!

✏️ఎ.రజాహుస్సేన్.!!
(A.Raja Hussain)

Leave A Reply

Your email address will not be published.

Breaking