Header Top logo

గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్ సిలబస్‌లో మార్పులు

సర్కార్ జాబ్ కావాలని రాత్రింబగళ్లు కష్ట పడుతున్నారా..?

అయితే.. ఈ వార్త మీరు తప్పక చదువాల్సిందే.. గ్రూప్‌-2 ఆఫీసర్ గా జాబ్ పొందాలనుకునే అభ్యర్థులు మారుతున్న పరిస్థితులను తెలుసుకోవడం ముఖ్యం.

గ్రూప్ 2 పరీక్షలలో సిలబస్‌లో మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.

హైదరాబాద్ :టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది.

గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్‌-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్‌-3లో ఎక్కువ మార్పులు జరిగాయి.

పేపర్‌-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్‌-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.

జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలు చేర్చారు. మూడో సెక్షన్‌లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం-మహిళలు అనే అంశాన్ని చేర్చారు.

పేపర్‌-3లోని ఒకటో సెక్షన్‌లో డెమోగ్రఫీ (జనాభా శాస్త్రం), ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్‌, నీతిఆయోగ్‌-పబ్లిక్‌ ఫైనాన్స్‌ జతచేశారు. రెండో సెక్షన్‌లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితోపాటు జనాభా-మానవవనరుల అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్‌, బడ్జెట్‌, పాలసీలు చేర్చారు.

మూడో సెక్షన్‌లో అభివృద్ధి-అండర్‌ డెవలప్‌మెంట్‌, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం- సుస్థిర అభివృద్ధిని కొత్తగా కలిపారు.

గ్రూప్-2 పరీక్ష విధానం:

మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.

పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.01.2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2023

పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

మ‌రోమారు డిజిథాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇంట‌ర్న్‌షిప్ చాన్స్‌

– నెల పాటు అమెరికాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూర్

– జ‌న‌వరి 4వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌ర‌ణ‌

– ఇప్ప‌టికే శిక్ష‌ణ పూర్త‌యిన వారికి వివిధ అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ఉద్యోగ అవ‌కాశాలు

 

  • మారబోయిన మాన్విక్ రుద్ర

Leave A Reply

Your email address will not be published.

Breaking