AP 39TV 11ఏప్రిల్ 2021:
జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 194 జయంతి సందర్భంగా సంగమేష్ సర్కిల్ నందు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి పోతుల నాగరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషిచేసిన గొప్ప మహనీయుడు విద్య విపక్ష పేదరికం ఆర్థిక సమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజుల వాసు, కార్యదర్శి మసాలా రవి, ఒకటో డివిజన్ కన్వీనర్ వేణుగోపాల్, రాజా, కృష్ణ, తదితర మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.