Header Top logo

783rd birth anniversary of Madhvacharya మధ్వాచార్య జయంతి

783rd birth anniversary of Vijaya Dasami Madhvacharya

ద్వైత మత బోధకులు మధ్వాచార్యులు

విజయ దశమి మధ్వాచార్య 783వ జయంతి

త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనం తరం వాయుదేవునకు తృతీయ అవతా రంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధకులు. ఆయన సాంప్రదాయా లను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్వమతస్తులు అంటారు. క్రీ.శ.1238 ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి (విజ యదశమి) నాడు ఆయన కొంకణ – కేరళ మధ్యనున్న కనరా మండలంలోని ఉడిపి పట్టణ సమీపస్థ పాజక క్షేత్రంలో మధ్య గేహభట్ట, వేదవతి దంపతులకు జన్మించారు.

ఉడిపిలోని అనంతేశ్వర స్వామిని చిరకాలం కొలిచిన ఫలితంగా శమున జన్మించినందున ఆయనకు వాసుదేవుడని తల్లిదండ్రులు పేరు పెట్టారు. అనంతర కాలంలో “పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్యాచార్య” అనే నామాలతో ప్రసిద్ధులైనారు. 8వ ఏట ఉపనయన సంస్కారియై, 10ఏళ్లకే సర్వవిద్యా పారంగతుడైనారు. 11ఏళ్ల వయసులో సన్యాసంవైపు ఆకర్షితులై, అచ్యుత ప్రజ్ఞ అనే

యతివర్యులైన ఆధ్యాత్మిక గురువు వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, “పూర్ణబోధ” పేరు నంది అనే గొప్ప పండితుని ఓడించి “మధ్వ, పూర్ణ ప్రజ్ఞుడు” బిరుదులు పొందారు. వేదాంత విద్యా రాజ్య పట్టాన్ని పొంది “అనంద తీర్థులు నామాంచితులైనారు. యుక్త వయసులోనే దక్షిణ భారతావనిలో కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం తదితర క్షేత్రాలను సందర్శించారు. తాను పొందిన తత్వజ్ఞానాన్ని ఉపన్యాస రూపంలో ప్రజలకు వివరించారు. శ్రీశంకర భగవత్పాదుల ప్రస్థాన త్రయానికి ఒనర్చిన భాష్యాలను మధ్వాచార్య విమర్శించారు. దక్షిణ దిగ్విజయయాత్ర గావిస్తూ, తన ముఖ్య శిష్యుడైన సత్యతీర్ధులతో కలిసి బదరి యాత్ర చేశారు. ఆ సందర్భంలోనే బ్రహ్మసూత్రాలపై భాష్యాలను పూర్తి చేశారు

స్వదేశానికి తిరిగి వస్తూ రాజమహేంద్రవరంలో శ్యామశాస్త్రి (నరహరితీర్థులు)ని మాయావాదం గురించి ఓడించి, ప్రచండవాదం గావించి, శిష్యుడిని చేసుకున్నారు. అలాగే అక్కడే శోభనభట్టు (పద్మనాభ తీర్థులు) అనే పండితుడు శిష్యుడైనాడు. ఉడిపిలో భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాసారు. రుగ్వేదంలోని 40సూక్తాలకు,భారత భాగవతాలకు వ్యాఖ్యానాలు రచించారు. శ్రీకృష్ణామ్యత మహార్షవం కర్మనిర్ణయం, మహా భారత తాత్పర్యంలాంటి అనేక గ్రంథ రచనలు గావించారు. తర్కంతో పాటు 37గ్రంథాలను విరచించారు. మధ్వాచార్య ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి, ద్వైతమత విస్తృత ప్రచారం గావించి, వైష్ణవ మత వ్యాప్తికి, ప్రధానంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ద్వారా ఇతోధికంగా కృషి సల్పారు. భీమసేనుని అవతారమని భావించే ఆయన వృకోదరత్వాన్ని పలుమార్లు ప్రదర్శించి, విష్ణు మంగళ గ్రామాన 200 అరటి పళ్ళను ఆరగింప ప్రార్ధితుడై అలవోకగా తినివేశారు. ఇషుపాతమనే మరో గ్రామంలో 1000 అరటి పళ్ళు తెచ్చిఇవ్వగా, అన్నింటినీ ఒకే ఊపులో ఆరగించారు. అడవి మార్గాన సంచరిస్తుండగా, పొదలనుండి వచ్చి, శిష్యుని మీద దూకిన పులిని ఒకే గుద్దుతో హతమార్చారు. కడూరా మండలంలోని ముద్ర గ్రామ సమీప తుంగభద్రా నదీ తీరాన అంబుతీర్ధమనే ప్రదేశాన ఒడ్డునుండి నదిలోనికి అడ్డంగా పడి ఉన్న పెద్ద బండరాయిని చూసి, విషయం కనుగొని, అవలీలగా ఒక్క చేతితో ఎత్తి అనుకున్న స్థలంలో అనువుపరిచారు. ఆయన అతిలోక బల సామర్థ్యానికి నిదర్శనంగా, ఆ బండ మీద (శ్రీ మధ్వాచార్వైరేక హస్తేన ఆనీయ స్థాపిత శిలా”అనే అక్షరాలు చెక్కబడినవై ఉన్నాయి. తమ 79వ ఏట క్రీ.శ.1817లో మాఘశుక్ల నవమి నాడు శిష్య సమేతులై బదరీ నారాయణుని దర్శించి, ఉత్తర బదిరిని ఒంటరిగా చేరి, వ్యాస భగవానుని కైంకర్యాలలో నిమగ్నమైనారు.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల

9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking