రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, స్థానిక శాసనసభ్యులు KTR ప్రారంభించారు. రూ.3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించారు. డైనింగ్ హాల్, వాలీబాల్, ఫుట్‌బాల్ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంధాలయం, మోడ్రన్ టాయిలెట్స్, సురక్షిత తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.