Header Top logo

13 is International Disaster Prevention Day విపత్తు నివారణ దినం

October 13 is International Disaster Prevention Day

ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

అక్టోబర్ 13న అంతర్జాతీయ విపత్తు నివారణ దినం

ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక దేశాల్లో ప్రకృతి విపత్తులు విరుచుకు పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న విధ్వంసంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతు న్నాయి. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 13 నాడు ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విపత్తుల ద్వారా కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించుకునే అంశాన్ని నినాదంగా ఐరాస స్వీకరించింది. ఈ సందర్భంగా  ప్రకృతి వైపరీత్యాల గురించి అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం. సహజ, సాంస్కృతిక వనరులను ధ్వంసం చేసి, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ప్రకృతి పరమైన, మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తు అనే పదాన్ని ఇంగ్లిష్‌లో “డిజాస్టర్” అంటారు. ఇది మధ్యయుగం నాటి ఫ్రెంచి పదం. దీన్ని మూడు భాషా పదజాలల నుంచి గ్రహించారు. అవి..1) డస్ (Dus), ఆస్టర్ (Aster) అనే గ్రీకు పదాలు. 2) డెస్ (Des), ఆస్ట్రే (Astre) అనే ఫ్రెంచ్ పదాలు. 3) డిస్ (Dis), ఆస్ట్రో (Astro) అనే లాటిన్ పదాలు గ్రీకు, లాటిన్ భాషల్లో డిజాస్టర్ అంటే ‘దుష్టనక్షత్రం’ అని అర్థం. అలానే విపత్తు అనే పదాన్ని ఇంగ్లీషులో డిసాస్టర్ అంటారు.

 

విపత్తు ఒక భయంకర పరిస్థితి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. పర్యా వరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమయ్యే అత్యవసర పరిణామమే విపత్తు’’. భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు, జల వైపరీత్యాలు , వడగాలి, అగ్ని, మహమ్మారులు, అంతరిక్షం, ప్రభావాల సంఘటనలు, సౌర జ్వాలలు తదితరాల ప్రభావం  మానవ జీవితంపై  అధికంగా ఉంది.అలాగే  ప్రపంచ యుద్దాలు, ఉగ్రవాదం, నక్సలిజం, అణు  బాంబులు లాంటివి మానవ కారక విపత్తులు విపత్తుల కిందకి వస్తాయి. విపత్తుల వల్ల 1) వరదలు – 30 శాతం; 2) తుపానులు – 21 శాతం; 3) కరవు- 19 శాతం; 4) మహమ్మారి వ్యాధులు – 15 శాతం; 5) భూకంపాలు, సునామీలు – 8 శాతం; 6) భూతాపాలు – 4 శాతం 7) హిమపాతాలు – 11 శాతం; 8) అగ్ని పర్వతాలు – 1 శాతం; 9) కీటక దాడులు – 1 శాతం; నష్టాలు సంభవిస్తున్నాయి.

vaiparityam 1

ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం.. భారత దేశంలో సంభవించే విపత్తుల International Disaster Prevention Day వల్ల జాతీయ ఆదాయంలో ఏటా 2.25 శాతం నష్టం వాటిల్లుతోంది. ‘ప్రివెన్షన్ వెబ్ స్టాటిటిక్స్’ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో గత మూడున్నర దశాబ్దాలుగా దాదాపు 431 రకాల విపత్తులు సంభవించాయి. వీటి ద్వారా సుమారు 1,43,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీటి ప్రభావానికి గురయ్యారు. సుమారు 4,800 కోట్ల అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. ఇవి ఇప్పటి వరకు భారత దేశంలో, ప్రపంచంలోనూ ఎక్కువసార్లు సంభవించిన విపత్తు ‘వరదలు’గా ఆ నివేదిక పేర్కొంది. ప్రకృతి విపత్తులకు భారత్ అంతులేని మూల్యాన్ని చెల్లిస్తోందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక కుండ బద్దలు కొట్టింది. 20 ఏళ్లలో విపత్తుల కారణంగా దేశం 7,950 కోట్ల డాలర్లు (సుమారు రూ.5.91 లక్షల కోట్లు) నష్టపోయింది. ఆర్థిక నష్టాలు, పేదరికం, విపత్తులు-  పేరిట 2017 ఆగస్టులో విడుదలైన నివేదికలో వివిధ, దేశాలు నష్ట పోయిన మొత్తం విలువ 2.9 లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అంతకు ముందు 20 ఏళ్ల వ్యవధి నష్టాల కంటే ఇది రెట్టింపు.

vaiparityam 2ప్రపంచంలో విపత్తుల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య 211 మిలియన్లు. విపత్తుల వల్ల భారత్ లో ఏటా 10 బిలియన్ల డాలర్ల నష్టం నష్టం జరుగుతోంది. మన దేశంలో  భూమి వరదలకు 12శాతం ( 8శాతం) గురవుతోంది. డిజాస్టర్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (ఐడీకేఎన్) రిపోర్టుల ప్రకారం దేశంలోని 29 రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏదో ఒక విపత్తుకు తరచు గురవు తున్నాయి. దేశంలోని తీరప్రాంతం విశిష్టమైన ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యానికి ప్రతీకలు. దేశ ఆర్థిక పరిపుష్టి లో విశేషమైన పాత్ర ఇవి పోషిస్తున్నాయి. 13 రాష్ట్రాల్లోని 84 జిల్లాలు, అండమాన్, లక్షద్వీప్ కేంద్రపాలిత రాష్ట్రాల్లో 7,500 కిలోమీటర్లలో సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. వీటిల్లో గుజరాత్ (1,214 కి.మీ.) ఆంధ్రప్రదేశ్ (7 కి.మీ.) రాష్ట్రాల్లో అధికంగా తీరప్రాంతం ఉంది. అడవులు, చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు, ఉప్పునీటి కయ్యలు, ఇసుక నేలలు వంటి జీవవైవిధ్యం తీరప్రాంతాల్లో ఉంటాయి. తీరంలోని యాభై కిలోమీటర్ల లోపు రమారమి ముప్పై కోట్ల మేర జనాభా నివసిస్తుంది.

vaiparityam 3 పర్యావరణ సమ తుల్యత లోపించడం వాతా వరణంలో పెనుమార్పులు విపత్తులకు మూలకారణం పెరుగుతున్న జనాభా, నగరీకరణ, తీర నియంత్రణ, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలు, పరిశ్రమలు, ఓడరేవుల విస్తరణ తీరంలోని జీవ వైవిధ్యానికి చేటు తెస్తూ సమస్యకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలైన తుపానులు, వరదల్లో మృతి చెందేవారికి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ఇస్తోంది. ప్రకృతి విపత్తులు, బీమా రంగం తన పాత్రను ఎక్కువగా నిర్వర్తిస్తూ వస్తూంది. ఈ రంగం, కొన్ని నష్టాలను పూడ్చుటకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తుంది. హరికేన్లు, దావాలనాలు, ఇతర విపత్తులు సంభవించి నపుడు ఈ బీమా రంగం సాయం అందిస్తున్నది.6.10.2009 నాటి రెవిన్యూ డిపార్ట్ మెంట్ జి.వో.23 ప్రకారం పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి 5000, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి 4000, బట్టల కోసం1500 పాత్రల కోసం1500, బియ్యం 20 కిలోలు, కిరోసిన్ 5 లీటర్లు ఇస్తారు. పర్యావరణ పరిరక్షణ చట్టం(1986)కు అనుబంధంగా తీరప్రాంత నియంత్రణ నిబంధనల పేరిట కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్ జెడ్) నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం 1991లో అమలులోకి తీసుకొచ్చింది కొన్ని వర్గాల కార్య కలాపాలకు అడ్డుగా ఉన్న ఈ నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వ వ్యవస్థ విఫల మయింది. విదేశీ నౌకా నియంత్రణ, పర్యా వరణ పరిరక్షణ, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అటవీ, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక చట్టాలు తీరప్రాంత పరిరక్షణతో ముడివడి ఉన్నాయి. 1991 నాటి నిబంధనల్లో తీరాన్ని మూడు విభాగాలు (సీఆర్ జెడ్-1,2,3)గా విభజించారు. ఆయా ప్రాంతాల్లో వివిధ నిర్మాణం చేపట్టడానికి నియంత్రణలు విధించాలి. అయితే పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ఇవి అడ్డుగా ఉన్నాయన్న ఉద్దేశంతో నిబంధనల్లో సవరణలు తీసు కొచ్చారు తప్పితే, నోటిఫికేషన్ లక్ష్యాలకు అనుగుణంగా నియమాలు అమలుచేసిన దాఖలాలు తక్కువ. సీఆర్జెడ్ నిబంధనలను 1991 మధ్య కాలంలో 12సార్లు సవరించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల విస్తరణకు అనుమతించారు. ఈ నోటిఫికేషన్ అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. అయితే నిబంధనల అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియంత్రించి ప్రకృతి వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అభివృద్ధి పనుల పేరిట మడ అడవులు, హరితవనాలను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విపత్తుల యాజమాన్య ప్రణాళికల అమలు మొక్కుబడిగా మారాయి. 2011 నుంచి కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్మించ తలపెట్టిన బహుళ ప్రయోజక షెల్టర్ల దశాబ్దాల క్రితంనాటి తుపాను షెల్టర్లు పూర్తిగా శిథిలమయ్యాయి.

ప్రకృతి వైపరీత్యాల నివారణకై,  ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందుపరచాల్సిన అవసరం ఉంది. నష్టం అంచనాలో పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగ స్వాములను చేయాలి.  ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, గొలుసుకట్టు హరిత వనాల పెంపకానికి, మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధులను సమకూర్చాలి. వైపరీత్యాలకు దారి తీయకుండా తీరప్రాంత వనరుల వినియోగం జరిగేలా చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేయాలి. క్షేత్రస్థాయి నుంచి పైదాకా ప్రభుత్వ వ్యవస్థల స్పందన బట్టి బాధిత ప్రజలకు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కోగలమనే ధైర్యం కలిగించాలి.

Ramakistaiah sangabhatla1

  రామ కిష్టయ్య సంగన భట్ల సెల్: 9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking