AP 39TV 07ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా , రాయదుర్గం నియోజకవర్గం, పరిధిలోని కణేకల్ మండలం ప్రజలకు మంగళవారంనాడు అనగా 07-04-2021 తేదీన 108 సిబ్బంది మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది 108 అంబులెన్స్ ఉచిత సేవల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 ఆంబులెన్స్ ఫైలెట్ తిప్పేస్వామిమరియు EMT సూర్య తేజ ప్రజలకు 108 లేదా ఆంబులెన్స్ ఉచిత సేవలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విధానాన్ని 24×7 ఏ సమయంలోనైనా చరవాణి ద్వారా 108 సంఖ్యకు అత్యవసర పరిస్థితులలో సంప్రదించి ఆంబులెన్స్ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొన్ని సందర్భాలలో 108 కు సంప్రదించినట్లయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఆంబులెన్స్ కు వెళ్లినట్లుఅయితే ఈ క్రింది నంబర్లను 8331032041,6304435411
సంప్రదించవలసిందిగా 108 సిబ్బంది తెలియజేశారు .అదేవిధంగా ఆంబులెన్స్ లొ ఉన్న వైద్య పరికరాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి.