Header Top logo

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతున్న మోడీ ప్రభుత్వం

భూర్గం పహాడ్ : నేడు సారపాకలో సి.పి. యం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ ఈశ్వరరెడ్డి గారి అధ్యక్షతన మండల పార్టీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కామ్రేడ్ A J రమేష్ గారు హాజరయ్యారు.
సమావేశం లో పార్టీ నిర్మాణం గురించి చర్చ జరిగింది . బిజేపి ప్రభుత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యకర్తలను తయారు చెయ్యాలని ఈ సందర్భంగా సూచించారు.
కార్పొరేట్ కంపనీలకు అనుకూలంగా , కేవలం వారి లాభా పేక్ష కోసం రూపొందిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు రైతులకు మాత్రమే కాక వినియోగ దారులం దరికి నష్టదాయకం అని వివరించారు. సి.పి.యం పార్టీ కార్యకర్తలు ప్రజలలోకి వెళ్ళి చట్టాల పట్ల అవగాహన కల్పిం చాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మండల కమిటి సభ్యులు బయ్యారాము కందుకూరి నాగేశ్వర రావు గుంటక క్రిష్ట రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking