Header Top logo

విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం

కృష్ణాజిల్లా_ నూజివీడు మండలం గొల్లపల్లి నుండి పొలసానిపల్లి వెళ్లే రహదారిలో విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం కాగా అది తెలియక బైక్ పై వెళుతూ ఇద్దరు వ్యక్తులు కంటైనర్ పట్టుకుని విద్యుదాఘాతంతో బైక్ తో సహా సజీవ దహనం అవటంతో మృతదేహాలను తరలించడానికి ఆ సమీపాన ఉన్న స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మానవత్వం కనబరిచిన ముగ్గురు కానిస్టేబుళ్లు 1659- మారేశ్వరరావు, 564- శివన్నారాయణ, 1516- కృష్ణ దహనం కాబడిన మృతదేహాలను వెలికి తీశారు.కానిస్టేబుల్ వెలికితీసిన మృతదేహాలను రూరల్ ఎస్ఐ రంజిత్ కుమార్ సిబ్బంది తో కలిసి ఆస్పత్రికి తరలించారు.సకాలంలో సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ వచ్చేలా కృషి చేసి మంటలను అదుపులోకి తెచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించిన నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర రావు మరియు నూజివీడు రూరల్ ఎస్ ఐ రంజిత్ కుమార్లను, మరీ ముఖ్యంగా మృతదేహాలను వెలికి తీయటానికి ఎవరు సాహసించ కపోయినా మానవత్వంతో వాటిని వెలికితీసిన కానిస్టేబుళ్లను స్థానికులు అభినందించారు..

 

Leave A Reply

Your email address will not be published.

Breaking