జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామం నుండి మొండ్రాయికి వెళ్లే ప్రధానరహదారిలో ఓ రైస్ మిల్లు వద్ద వడ్లలోడుతో ఉన్న ట్రాక్టర్లు గత వారం రోజులనుంచి బారులు తీశాయి.అసలే ప్రమాదాలకు అడ్డా.! భయంకర మూలమలుపు గడ్డా..!ఆమూలమలుపు వద్ద ఇలా ట్రాక్టర్లు రోడ్డుప్రక్కనే నిలుపడంతో వాహనడ్రైవర్లు ఊపిరి బిగపట్టి..ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. ప్రయాణిస్తున్నారు.ఇప్పటికైనా పోలీసులు,అధికారులు చొరవ తీసుకొని రోడ్ల మీద ట్రాక్టర్లను నిలుపకుండా చేయాలని వాహనచోదకులు కోరారు.రిపోర్టర్:జి.సుధాకర్.