వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో రైతులు ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రకాష్, సిఐటియు అమాలి యూనియన్ నాయకులు రామానాయుడు, సీఐటీయూ మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ ఢిల్లీలో ఇరవై రెండు రోజుల నుంచి పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా గ్రామంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను నూతన విద్యుత్తు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివ , మధు శేఖర్ , హమాలి యూనియన్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు..