Header Top logo

రైతుల కష్టం దళారుల పాలు కాకుండా KCR కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపీపీ బి.రాణిబాయి రామారావు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు మధ్య దళారుల పాలు కాకుండా గుట్టు బాటు ధరకు విక్రయించుకునేందుకే మన ముఖ్యమంత్రి KCR ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బి.రాణిబాయి రామారావు అన్నారు. శుక్రవారం మహాదేవపురం మండలం లోని బొమ్మపూర్, ఎలికేశ్వరం గ్రామాల్లో ఐ కే పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించైన అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు అనుకూలించక అధిక వర్షాల కారణంగా వరి పంట దిగుబడి తగ్గిందని, కేంద్రం నిర్వాహకులు తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. రైతులకు బార్ధన్, రవాణా తదితర విషయాలపై ఇబ్బంది కలుగకుండా ఐ కే పీ అధికారులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పుష్పలత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ పద్మ ఓదేలు, సర్పంచ్ లు మధునమ్మ, పద్మా రవీందర్ రెడ్డి, ఐకేపీ APM రవీందర్, C. C. నిర్మల, మండల సమాఖ్య అధ్యక్షుడు భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
వీర గంటి శ్రీనివాస్..

Leave A Reply

Your email address will not be published.

Breaking