Header Top logo

రెబ్బెన లో కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బేజ్జుర్ మండలం రెబ్బెన లో కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ బహుమతుల ప్రధానంప్రజాబంధు స్వర్గీయ శ్రీ పాల్వాయి పురుషోత్తం రావు గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న స్మారక కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రెబ్బెన గ్రా,, బెజ్జుర్ మండలం లో నిర్వహించడం జరిగింది. ఉత్కంఠ మధ్య జరిగిన కౌటాల – అనుకొడ టీమ్ మధ్య ఫైనల్ మ్యాచ్ లో కౌటాల టీమ్ విజేత గా, అనుకోడ టీం రన్నరప్ గా నిలవడం జరిగింది. విజేతలకు బహుమతి రూ. 10000/-, రన్నరప్ కు రూ. 6000/- బెజ్జుర్ మండల కాంగ్రెస్ కమిటీ వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయటం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్ & బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాచకొండ శ్రీవర్ధన్ మాట్లాడుతూ గ్రామాలలో క్రీడా స్పూర్తిని పెంపొందించుటకు గత మాసం నుండి ప్రజాబంధు స్వర్గీయ పాల్వాయి పురుషోత్తం రావు గారి జ్ఞాపకార్ధం స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు కార్యం వనిత, చాకటీ విజయ్, సింగిల్ విండో డైరెక్టర్ రాచకొండ శ్రీవర్ధన్, సులుగుపళ్లి ఉప సర్పంచ్ సిడాం సంతోష్, మాజీ సర్పంచ్ లు వసి ఉళ్ళఖాన్, వెంకటేశ్, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యం సతీష్, పాపయ్య, మండిగ హన్మంతు, చిలుకయ్యా, శంకర్, మల్లేష్, శ్రావణ్, మహేందర్, పేట శ్రీనివాస్, గణేష్, భీమ్ రావ్ మరియు పాల్వాయి అభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking