Header Top logo

మిషన్ భగీరథ ఎక్కడ….?

మహాదేవపూర్ మూడు నెలలుగా కాలనీవాసుల మంచినీటి కి తప్పని తిప్పలు సర్పంచ్ కు చెప్పినా పట్టించుకోని వైనం. త్రాగు నీరు లేక మండల కేంద్రం నుండి ప్లాంట్ మరియు బోర్ల నుండి సేకరణ.

మహాదేవపూర్ మండల బ్రాహ్మణపెళ్లి గ్రామపంచాయతీ పరిధిలోని మహాదేవపూర్ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న బ్రాహ్మణపెళ్లి బి.సి.కాలనీ వాసులకు మూడు నెలలుగా మంచినీరు లేక ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు. గ్రామసర్పంచ్ కి పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ సర్పంచ్ స్పందించకపోవడంతో కాలనీవాసులు ఆవేదనకుగురై చేసేది ఏమి లేక దాహాన్ని తీర్చుకోవడానికి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పార్కు బోర్లవద్దకు వెళ్లి త్రాగు నీటిని సేకరిస్తూ అలాగే ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి కొంత రుసుము చెల్లించి నీటిని సేకరించి దాహం తీర్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ మంచినీరు అందించే తరుణంలో కాంట్రాక్టర్ మరియు అధికారుల నిర్లక్ష్యం వలన కాలనీవాసులకు మిషన్ భగీరథ నీరు వారికి అందని ద్రాక్షగా మారింది . మూడు నెలలుగా ఎన్నో మార్లు మొర పెట్టుకున్నప్పటికీ సర్పంచ్ మరియు అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు .ఈ యొక్క కాలనీవాసుల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది . ఇకనైనా ఈ కాలనీవాసుల పరిస్థితి చూసి వారికి మంచినీరు అందేలా చేసి సర్పంచ్ మరియు మిషన్ భగీరథ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నాను.
రిపోర్టర్. వీరగంటి శ్రీనివాస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking