Header Top logo

భారత మానవ హక్కుల మండలి అధ్వర్యంలో ప్రజా సమస్యల సదస్సును విజయవంతం చేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ది.18.12.2020 న భారత మానవ హక్కుల మండలి అధ్వర్యంలో జరగబోయే ప్రజా సమస్యల మీద సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మద్దిశెట్టి సామేలు గారు మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ,మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రజా సమస్యలపై ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. సమ్మక్క, సారక్క పూజారులకు నెలసరి వేతనం మంజూరు చేయాలని, ఇళ్లు లేని నిరుపేదలకు పక్క ఇళ్లు మంజూరు చేయాలని, వివిధ ప్రజా సమస్యల మీద సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చీమల గోపాల్, తెల్లం అచ్చమ్మ, సూర్ణపాక చంద్రమ్మ, మాలోత్ విజయ, బొర్రా దుర్గా, జారే సీతమ్మ, పద్ధం చిట్టెమ్మ, లకవత్ లలిత, మూతి బాలరాజు, వేముల నరసింహారావు, కేసరి కోటేశ్వరరావు, చింతల రమేష్, దారవత్ లక్ష్మి, గాందర్ల నిత్యానందం తదితరులు 200 మంది పాల్గొన్నారు.కరపత్రం పంపిణీ చేసిన వారిలో భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనూరి శ్రీనివాస్, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఇనపనూరి నవీన్, మడకం చలపతి, పద్ధం రాము, సోయాం ఎల్లయ్య, కవాసి సతీష్, పోడియం రాజు, మడకం కౌస, మడివి మహేష్, భద్ర ,రాజు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking