ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తులుగా మారిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంAISB సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ కొండ ప్రశాంత్
కరోనా కష్ట కాలంలో పలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులను ఫీజుల పేరిట నరక యాతన పెడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం పై తక్షణమే చర్యలు తీసుకోవాలని AISB సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ కొండ ప్రశాంత్ గారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా గజ్వెల్ పట్టణం లో AISB జిల్లా మహిళ కన్వీనర్ పర్స సౌజన్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సౌజన్య గారు మాట్లాడుతూ, ఆన్లైన్ క్లాసుల పేరిట ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ధనార్జనే ద్యేయంగా పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థుల కుటుంబాల దగ్గర వేలకు వేలు ఫీజులను వసూలు చేస్తూ పీల్చుకొని తింటున్నారని ఆవిడా మండిపడ్డారు. కరోనా సమయంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను పిలిచి మాస్కులు ధరించకుండా విద్యా బోధనను నిర్వహించడం సిగ్గు చేటని AISB జిల్లా మహిళా కన్వినర్ సౌజన్య గారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పద్ధతులు పాటించకుండ విద్యా బోధన చేస్తున్న పలు ప్రైవేట్ విద్యాసంస్థలపై (s.t జోసెఫ్ స్కూల్ పై ) తక్షణమే విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆవిడా డిమాండ్ చేశారు. లేని యెడల మా AISB ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కారకండీగా ఆవిడా హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రవికుమార్ మింటూ భాయ్ తదితరులు పాల్గొన్నారు.దుబ్బాక ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..