Header Top logo

ప్రజా సమస్యలపై అవగాహనా సదస్సు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సమ్మక్క సారక్క మరియు గజ్జల పూజారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత సంవత్సర కాలం నుండి అనగా ది.29/10/2019 న హెడ్.ఆర్.సి తరపున 4000 మంది పూజారులకు నెలసరి వేతనం మంజూరు చేయాలని, వారు పూజారులుగా ఉన్న ఆలయాల దగ్గర మంచినీరు , కరంటు ఇతరత్రా మౌలిక వసతులు కల్పించాలని , గుడి చుట్టూ ప్రహరి గోడ నిర్మించాలని తెలంగాణ ఎస్సీ – ఎస్టి కమీషను కి దరఖాస్తు ఇవ్వగా కమీషన్ స్పందించింది ది.08 / 11 / 2019 న ఆర్సి.నెం .84 / 004248 / 2019 న దేవాదాయ శాఖ కమీషనర్ గారికి , ఉమ్మడి జిల్లాల కలెక్టరు గారికి ఆదేశాలు జారీచేశారు . అదే విధంగా పూజారులకు జీతాలు మంజూరు చేయాలని కోరుతూ ది .31/10 / 2018 న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనరి గారికి , ది .25 / 02 / 2020 న ఉమ్మడి జిల్లాల కలెక్టరు గారికి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది . ది . 15 / 12 / 2020 న ఎస్సీ ఎస్టీ కమీషన్ గారికి పూజారులకు ఇచ్చిన లేఖను అమలు పరచాలని కోరుతూ దరఖాస్తు చేశాము.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 14 మండలాలు,40 గ్రామాలకు చెందిన గిరిజనులకు కులం , ఆదాయం ధృవపత్రాలు , పోడ పట్టాలు జారీచేయాలని , త్రాగునీరు , కరంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, పక్కా ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ది .23 / 09 / 2020 న భూపరిపాలన కమీషన్ ( సి.పి.ఎల్.ఎ) గారికి గిరజనుల కోసం హెచ్.ఆర్.సి. తరఫున దరఖాస్తు ఇచ్చినాము . కమీషన్ స్పందించి ఫైల్ నెం .384 / 2020 ప్రకారం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించమని ఆదేశాలు జారీచేసారు.సింగరేణి బ్లాస్టింగ్ వల్ల సత్తుపల్లి పరిధిలోని ఎన్.టి.ఆర్.నగర్ , వెంగళరావునగర్ నందు కూలిపోయే దశలో వున్న ఇండ్లకు నష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతూ ది .17 / 09 / 2020 న హెచ్.ఆర్.సి. తరపున తెలంగాణ మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయగా , గౌరవ కమీషన్ 120 రోజుల్లో 1000 ఇండ్లకు నష్టపరిహారం మంజూరు లేదా మరమ్మతులు చేయించవలసినదిగా ది . 19 / 08 / 2020 న ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీచేసినారు.ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్య అతిధులు :షేక్ ఖలీఫతుల్లా బాషా గారు – Chairman , HRCI South Region,పొంగులేటి శ్రీనివాసరెడ్డిగారు – Ex Parliament Member, Khammam,
డా. అనూహ్య రెడ్డిగారు – Vice Chairman , HRCI South Region, కోవిధ సహృదయ chairman and founder, జాతీయ క్వాలిటీ కంట్రోల్ బోర్డు మెంబర్,మట్టా దయానంద్ గారు – Founder , Asha Voluntary Organization , Sathupalleకూసంపూడి మహేష్ గారు – Chairman , Sathupally Municipalityపొదిలి వెంకటరమణగారు . S10 న్యూస్ ఛానల్ , సామాజిక తెలంగాణ దినపత్రిక వ్యవస్థాపకులు,చిత్తలూరి ప్రసాద్ గారు – స్వచ్చంద సేవా సంస్థల ఛైర్మన్, ఉన్నం జ్ఞానసుందరిగారు – Chairman , A.P.State HRCI,సున్నం నాగమణిగారు – ZPTC , Mulakalapalli నారాయణవరపు శ్రీనివాస్ గారు – జాతీయ బి.సి.సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,
ధర్మసోత్ దశరథ్ నాయక్ గారు – LHPS Khammam District President,
వివిధ కుల సంఘాల నాయకులు హాజరవనున్నారు . కరోనా ను దృష్టిలో పెట్టుకొని అతి కొద్దిమంది మాస్కులు , శానిటైజర్లు ధరించి హాజరవుతారు.

ఇట్లు
1 ) మద్దిశెట్టి సామేలు HRCI తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ & సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ,
2 ) ఇనపనూరి శ్రీనివాసరావు HRCI తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్,
3 ) నారపోగు వెంకటేశ్వర్లు HRCI తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్,
4 ) ఇనపనూరి నవీన్ కుమార్ HRCI సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి,
5 ) కూరం పాండు HRCI సత్తుపల్లి మండల అధ్యక్షులు,
6 ) రావూరి నాగేశ్వరరావు HRCI వేంసూరు మండల అధ్యక్షులు,
7 ) తేళ్ళూరి రఘు HRCI తల్లాడ మండల అధ్యక్షులు,

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking