ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటము తోనే పార్టీ విస్తరణ CPI పట్టణ సమితి సమావేశంలో తమ్మళ్ల వెంకటేశ్వరరావు. అకోజు సునీల్ కుమార్
భద్రాచలం…దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీల ఉద్యమాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్న విధానం పై కమ్యూనిస్టు పార్టీ ల ప్రభావం పెరుగుతుంది అని. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారానే పార్టీ విస్తరణ కు కార్యకర్తలు కృషి చేయాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు అన్నారు..
మంగళవారం స్థానిక CPI కార్యాలయంలో బల్లా సాయి కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టణ కౌన్సిల్ ముఖ్యకార్యకర్తలసమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రం తీసుకవచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని .ఢిల్లీ లో జరుగుతున్న రైతు పొరుతో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్నారు.అదేవిధంగా అకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ కేవలము ఎన్నికల కోసమే ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నదని.కాళీ పోస్టు లను భర్తీ చేయాలని ప్రకటన లు ఇవ్వటానికే ముఖ్యమంత్రి పరిమితం కాకుండా తొందర గా భర్తీ చేయాలని అన్నారు.ఢిల్లీ కి కేంద్రం పెద్దలను కలిసిన ముఖ్యమంత్రి డిల్లీ రైతుల ఆందోళన దగ్గరకు వెళ్లి మద్దతు ఇచ్చి ఉంటే నిజమైన రైతు పక్షపాతి గా గౌరవం దక్కేది అన్నారు
ప్రజా సమస్యలపై భద్రాచలం పట్టణంలోనిరంతరం పోరాటం ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో SVS నాయుడు. భద్రాద్రి వెంకటేశ్వరరావు. విశ్వనాద్. శ్రీ రాములు. మీసాల భాస్కరరావు. హిమాం ఖాసీం. మారెడ్డి గణేష్. SK ఖాదర్. దానియేలు ప్రదీప్ .గోపి పూలమ్మ.సీత. పుష్పలత. రమణమ్మ. రాంబాబు.బాబీ.రామారావు. శివ తదితరులు పాల్గొన్నారు.