Header Top logo

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి : డిజిపి

నల్లగొండ : రాష్ట్రంలో పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేసిన జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తో పాటు పలు జిల్లాల ఎస్పీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.డిఐజి, జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఫలితంగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు. ఇంకా పెండింగులో ఉన్న కేసులన్నింటిని పరిష్కరించేలా కృషి చేస్తున్నామని ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేసే విధంగా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని డిజిపి వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, రమణా రెడ్డి, సిఐలు రవీందర్, ఆదిరెడ్డి తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking