మహాదేవపూర్ మండల పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అంబటిపల్లి లో ఆవులకు గేదెలకు ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమం నిర్వహించారు. 229 ఆవులు ఎద్దులు మరియు443 గేదెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ, ఎంపీటీసీ సర్పంచ్ పశు వైద్య అధికారులు డాక్టర్ మల్లేష్ డాక్టర్ జగపతిరావు సిబ్బంది సరళ సమద్ లావణ్య లక్ష్మణ్ బాలయ్య రమేష్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ వీరగంటి శ్రీనివాస్.