కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ సత్యాగ్రహ దీక్ష తేదీ: 22-12-2020, మంగళవారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఇందిరా పార్క్, హైదరాబాద్ వద్ద కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన (RGPRS), తెలంగాణ శాఖ అధ్వర్యంలో “పంచాయతీ రాజ్ సత్యాగ్రహ దీక్ష” కార్యక్రమం కలదు. ఈ దీక్ష లో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారు.స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బలంగా మన పంచాయతీ రాజ్ గళాన్ని వినిపిద్దాం.కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపిలు, ఎంపిటీసిలు,సర్పంచులు, వార్డ్ మెంబర్లు మరియు మునిసిపల్ కౌన్సిలర్లు స్థానిక సంస్థల కోసం జరుగుతున్న ఈ సత్యాగ్రహ పోరాటంలో పాల్గొని దీక్షను విజయవంతం చేయగలరని మనవి.
ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్