కృష్ణాజిల్లా :తిరువూరు హోటళ్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.సుందరయ్య కాలనీ రోడ్డు లోని బావర్చి హోటల్లో నిల్వ ఆహార పదార్దాలను, మాంసం సరఫరా చేస్తుండటంతో ప్రజారోగ్యానికి భంగం వాటిల్లుతుందని, హోటల్ ను తెరవరాదని నోటీసు జారీ చేశారు.నిల్వ పదార్థాలు వినియోగించి ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..