పొందూరు మండలంలోని తాడివలస గ్రామ పంచాయతీ, తాడివలస గ్రామంలో గత కొంతకాలంగా మురికి కాలువల్లో పిచ్చి మొక్కలు,చెత్త పేరుకుపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు,గ్రామంలో మహమ్మారి కరోనా విస్తృతంగా విజృంభించి గ్రామంలోని నాలుగు వీధులలో ప్రజలు కరోనా బారీన పడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవనం సాగించారు.ప్రభుత్వం పలుమార్లు గ్రామాల్లో పారిశుద్ధ్యం చేయాలని కోరిన స్థానిక నాయకులు,అధికారులు లలో ఎరకమైన స్పందన కనబడకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు.ప్రస్తుతం గ్రామంలో ఈ పారిశుధ్యం పనులు స్థానిక పంచాయతీ కార్యదర్శి సమీరా పర్యవేక్షణలో చేపడుతున్నారు.ఇప్పటికైనా ఈ పనులు జరుగుతున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్