Header Top logo

జహీర్ సార్ ఇక లేరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  : జిల్లా ఇంటర్ విద్యా DIEO జహీర్ అహ్మద్ సార్ ఆకస్మికంగా మృతి చెందారు. కొత్తగూడెంలోని వేపల గడ్డలో తన నివాస గృహంలో మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఎంతో మంది విద్యార్థులకు జహీర్ గారు…. సుదీర్ఘకాలంపాటు విద్యను అందించారు. కెమిస్ట్రీ అధ్యాపకునిగా తన ప్రస్థానం ప్రారంభించారు. తొలుత భద్రాచలం పట్టణంలో చాలా ఏళ్లుగా కెమిస్ట్రీ ట్యూషన్స్ చెప్పారు. అనంతరం పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు. తదుపరి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్ గా పని చేశారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తూ…. RIO , DIEO గా వ్యవహరించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 రిటైర్మెంట్ కాగా… రెండు రోజులు ముందుగా జహీర్ గారు మరణించడం పలువురుని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా , ఉన్నతాధికారిగా ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు చేత జహీర్ గారు ప్రశంసలు అందుకున్నారు. ఎంతో సౌమ్యుడిగా ఉండే జహీర్ గారు ఇక లేరు అనే వార్త…. యావన్మంది శిష్యులను, స్నేహితులను తీవ్ర కలవరానికి గురి చేసింది. జహీర్ గారి మృతి పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని , సంతాపాన్ని తెలిపారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking