కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని పుల్లగుమ్మి గ్రామం నందు గ్రామ మహిళలతో గ్రామం పేదరిక తగ్గింపు ప్రణాళిక పై అవగాహన సదస్సు సి.సి జె. చాముండేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమావేశం నందు మహిళలతో వి పి ఆర్ పి సర్వే చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన నుండి బయటపడడం అని వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరిచారు. మరియు వై ఎస్ఆర్ చేయూత లభించిన వారికి జీవనోపాధి కొరకు మరల బ్యాంకు నుండి లోను ఇవ్వబడును అనగా వైయస్సార్ చేయూత రూ..18750/ మరల బ్యాంకులోన్ రూ..56250/ రూపాయలు జీవనోపాధి కొరకు లోన్ ఇవ్వబడును అని అని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ జీవనోపాధి కొరకు ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని పేదరికాన్ని నిర్మూలించి సహకరించాలని తెలిపారు ఈ సమావేశంలో వెలుగు సి సి మరియు మద్దిలేటి స్వామి వి.వో ఏ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి