తేదీ: 23-12-2020 నాడు సాయంత్రం 5:30 గంటల సమయమున గోనపల్లి గ్రామానికి చెందిన అనంతోజి శివకృష్ణ తండ్రి జగదీశ్వర్, వయస్సు 35 సంవత్సరములు మండలం చిన్నకోడూరు. కుటుంబ సమస్యలతో ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో కాల్ ద్వారా వారి బంధువులకు తెలపగా బంధువులు డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందించగా చిన్నకోడూరు ఎస్సై సాయి కుమార్ అతని వివరాలు మరియు సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని, టవర్ లొకేషన్ గురించి ఐటి కోర్స్ సిబ్బంది శశికాంత్ తెలపగా శశికాంత్ సంబంధిత ప్రొవైడర్ తో మాట్లాడి టవర్ లొకేషన్ కనుక్కొని చెప్పగా మర్పడగ గ్రామ శివారులో ఉన్నాడని తెలుపగా బ్లూ కోల్డ్స్ సిబ్బంది మహేష్ కానిస్టేబుల్ హోమ్ గార్డ్ శంకర్ సంఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని రాగా ఎస్ఐ సాయి కుమార్ అతని భార్య పిల్లలను బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారికి అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కుటుంబంలో సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలి, తెలిపారు. మరియు అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు ఏదైనా కుటుంబ సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కు వస్తే ఇరువురిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు ….. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్ చిన్నకోడూరు మండలం.