Header Top logo

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ప్రజా నేత్ర న్యూస్ విజయనగరం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి  ఏ.పి. స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ -ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు భవనంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జి అప్పలసూరి,సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి కాంతారావు, 104 ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, మెడికల్ అండ్ హెల్త్ కంటెంజెంట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గారావు, పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి. రవింద్రబాబు, వెటర్నరీ డిపార్ట్మెంట్ నుండి రాజు, సూర్యనారాయణ, ITIల నుండి చంద్రశేఖర్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 2018 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన విజయనగరం పట్టణంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏ.పి. స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా నాయకత్వం కలిసి నప్పుడు ” కాంట్రాక్ట్ ఉద్యోగులను అర్హత, అనుభవం ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తాం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 30న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు వస్తున్న సందర్భంగా పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేషన్లో, స్థానిక సంస్థల్లో, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువ. ఆ ఇచ్చిన జీతాలు కూడా ప్రతి నెల రావు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి సంక్షేమ పథకం అమలు కాకపోతే ఆ మేరకు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు కూడా నష్టపోతారు. చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దీర్ఘకాలం నుండి పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయకపోవడం అన్యాయం. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల నుండి మినహాయింపు ఇవ్వాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ తదితర సౌకర్యాలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకపోగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నుండి మినహాయించడం ఏమి న్యాయమని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వ రేషన్ కార్డు నుండి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న నిత్యవసర వస్తువుల రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అమ్మ ఒడి పథకం ఎందుకు అమలు చేయడం లేదు, రేషన్ కార్డు ఎందుకు తొలగిస్తున్నారని అడుగుతున్నాము. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వస్తున్న జీతాల తక్కువైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం వల్ల వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఉంటున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకం అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తున్న అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ డిమాండ్ చేస్తున్నది.కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అప్పడివరకు అమ్మ ఒడి పథకాన్ని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేసి నిత్యావసర వస్తువులు రేషన్ కార్డులు కొనసాగించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోరుతున్నది..బిరుసు ఎర్నాయుడు రిపోర్టర్ విజయనగరం..

Leave A Reply

Your email address will not be published.

Breaking