Header Top logo

కాంగ్రెస్ 136వ ఆవిర్భావ వేడుకలు

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి నాయకులు ఘనంగా కాంగ్రెస్ 136వ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు .ఈ కార్యక్రమానికి టి పి సి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ జగదీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్ , కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరుశురాం నాయుడు, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణ మరియు వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం వేడుకలలో భాగంగా అందరికీ పండ్లు పంచడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మరియు ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కీలకపాత్రను పార్టీ నాయకులు తెలియజేశారు. కొల్లాపూర్ కాన్స్టెన్సీ రిపోర్టర్ చంద్రశేఖర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking