Header Top logo

కనేకల్ మండలం తాసిల్దార్ వాలంటీర్లకు అవగాహన సదస్సు ,

ఏపీ 39 టీవీ 25 జనవరి 2021:

కనేకల్ రాయదుర్గం తాలూకా, కనేకల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి వాలంటీర్లకు, ఏం డి యు , స్టోర్ డీలర్లకు నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం లో భాగంగా కనేకల్ తహసిల్దార్ ఉషా రాణి అవగాహన కల్పించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో మాదిరిగానే నిత్యావసర సరుకులు స్టోర్ డీలర్లకు చేరుకుంటాయి. స్టోర్ డీలర్ ల నుండి ఏం డి యు అభ్యర్థులు వాహనాల్లో తీసుకువెళ్లి ఇంటికి సరుకులు పంపిణీ చేస్తారు. ఈ సరుకులు పంపిణీ చేయకముందే వాలంటీర్ తన 50 ఇళ్లలో నివసిస్తున్న వారికి ముందుగానే తెలియజేయాలి, వారికి అవగాహన కల్పించి F.P. షాప్ నుండి అయితే వస్తుందో ఆ షాపులో ఉన్న వ్యక్తికి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది . ఒక రోజుకి నూరు కార్డుల వరకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. పక్కన ఇళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వలేదని పక్కన వారు ఆందోళన చెందవద్దని తెలియజేశారు. వారికి ఏ F.P. షాపులో అయితే ఉంటారో ఆ షాపు వచ్చినపుడు వారికి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని సభా ముఖంగా తెలియజేశారు. రోజు రోజు నిత్య అవసర సరకులు ఏం డి యు మిగిలిన సరుకులను, ఆరోజు సరుకులు ఎంత పంపిణీ చేశారు ఆ యొక్క మొత్తాన్ని ఆ షాప్ డీలర్ కు అందజేయాలని తెలియజేశారు. సరుకులను సాయంత్రం ఆరు గంటలకు తిరిగి స్టోర్ డీలర్ కు అందజేసి మరుసటి రోజున ఆ సరుకులను స్టోర్ డీలర్ ద్వారా సరకులను తెచ్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, ఏండి యు, సచివాలయ సిబ్బంది , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

R. ఓబులేసు,
అనంతపూర్ లైవ్ న్యూస్,
కనేకల్.

Leave A Reply

Your email address will not be published.

Breaking