కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని సచివాలయం 1,2 కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దిన్. ఈ ఆకస్మిక తనిఖీల యందు జాయింట్ కలెక్టర్ సచివాలయ సిబ్బంది యొక్క హాజర్ రికార్డ్స్, మరియు తదుపరి రికార్డులను కూడా తనిఖీ చేసి విధి నిర్వహణలో సక్రమంగా హాజరవుతున్నరా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందే పథకాలను సక్రమంగా వారికి అందేలా విధినిర్వహణలు నిర్వహించండి అని చెప్పారు. ఈ కార్యక్రమము నందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిదీన్, వీఆర్వో రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సచివాలయం 1,2 సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి ..