Header Top logo

అమరవీరుల త్యాగం వృథా కాదు – రాజమండ్రి పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్టిన్ లూథర్

సీతానగరం ప్రజానేత్ర న్యూస్ : నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం
చేస్తున్న ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల
త్యాగం వృథా కాదని రాజమండ్రి పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం రాజానగరం గ్రామంలో గ్రామంలో రైతులకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మార్టిన్ లూధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. విద్యుత్ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరుతూ రైతులు నడుపుతున్న ఉద్యమం 25 రోజులకు చేరుకుందన్నారు. ఈ పోరాటంలో 32 మంది రైతులు అమరులయ్యారని అమరవీరుల అందరకి విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు. అమర వీరులయిన రైతులందరిని నరేంద్రమోడి పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్డిఎ భాగస్వాములు అనేక మంది నాయకులకు, దేశంలో ఉండే ప్రముఖులందరికీ, మేధావులకు ఈ నల్లచట్టాల వల్ల ప్రమాదం జరుగుతుందన్న విషయం అర్థమైం దన్నారు. మోడీకి ఈ విషయం అర్థం కాలేదంటే రైతులు అందరిని కార్పొరేట్ బానిసలుగా మార్చడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బిజెపి ప్రభుత్వాన్ని దేశ ప్రజలందరూ పాతాళంలోకి తొక్కేస్తారని హెచ్చరించారు. ఢిల్లీ రైతుల పోరాటం విజయం సాధించేంత వరకు సంఘీభావంగా దేశంలో ఉండే అన్ని తరగతులకు చెందిన ప్రజలందరినీ ఐక్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడా వెంకట్, రాజమండ్రి నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కంపూడి సత్తిబాబు, పిల్ల సుబ్బారెడ్డి, నల్లపటి శ్యామ్, కొరకుల సత్తిబాబు, కొండ, శ్రీను, ఏర్ల మర్చరెయ్య వంశీ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking