Header Top logo

అంగవైకల్య యువతి పెండ్లి కి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న గొడిశెల జితెందర్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన దర్శనపు లచ్చవ్వ ఎల్లయ్య ది నిరుపేద కుటుంబం వారికి పుట్టుకతోనే అంగవైకల్యంతో బిడ్డ జన్మించింది.ఆమె పుట్టిన కొద్దిరోజులకే తండ్రి ఎల్లయ్య అనారోగ్యంతో చనిపోగ దాదాపు 25సంవత్సరాల నుండి గ్రామంలోనే కూలీ పని చేసుకుంటు బిడ్డ శంకరవ్వ ను పోషించుకుంటు ఉంటుంది.వారికి ఇప్పటి వరకు ఉండటానికి ఇళ్లుకూడ లేదు..శంకరవ్వ కు పెండ్లి సంబందం రాగ పెండ్లి చేద్దామంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అట్టి విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ వారి ఇంటికి వెల్లి తన వంతు సహాయంగా 10,000/-రూ!! ఇచ్చి ఆడపిల్లకు మనోదైర్యం నింపి మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోస ఇచ్చి అదే విదంగా గ్రామంలో ఇంక ఎవరైన సహాయం చేసి మానత్వం చాటుకోవాలని అన్నారు.మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తానని అన్నారు..శంకరవ్వ కుటుంబ సభ్యులు సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ ధన్యవాదములు తెలిపినారు.. ఈ కార్యక్రమంలో MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ కుమార్,కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకటి,CPM రైతు విభాగం జిల్లా కార్యదర్శి గన్నేరపు నర్సయ్య,వార్డ్ మెంబర్ చిట్యాలశంకర్,నాయకులు బైండ్ల మల్లేశం,పసుల బాల్ రాజ్ ,దర్శనపు బాలయ్య, తదితరులు పాల్గొన్నారు…బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking