భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ; కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మిక్సో పతి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 11 న జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల బంద్ పాటిస్తున్నట్లు ఐఎంఏ భద్రాచలం అధ్యక్షులు డాక్టర్ జి వి వి సుదర్శన రావు, ఐఎంఏ భద్రాచలం కార్యదర్శి డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు.ఆయుర్వేద వైద్యులతో శస్త్రచికిత్సలు చేయించడం వల్ల రోగులకు ప్రాణహాని ఉంటుందన్నారు . ఎంబీబీఎస్ చదువు నాలుగేళ్లు , ఒక సంవత్సరం హౌస్ సర్జన్ , మూడు సంవత్సరాలు పీజీ కోర్సు పూర్తిచేసి , మరో సంవత్సరం పాటు సీనియర్ సర్జన్ల వద్ద పని చేసి , ఆ తర్వాతే అలోపతి వైద్యులు సొంతంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. ఆయుర్వేద వైద్యం చదువుకున్న వారికి అలోపతి వైద్యంపై అవగాహన ఉండదని పేర్కొన్నారు . ఆపరేషన్ సమయంలో ఎలాంటి మందులు వాడాలో కూడా తెలియదన్నారు . నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును జాతీయస్థాయిలో తీవ్రంగా వ్య తిరేకించినప్పటికీ కేంద్రం ఆ బిల్లును పాస్ చేసిందని తెలిపారు . మిక్సోపతి వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు . ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 11 న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆసుపత్రుల బంద్ పాటిస్తామన్నారు . కోవిడ్ -19 , అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోతాయని చెప్పారు ..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్