సీతానగరం ప్రజానేత్ర న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో క్రీస్తుసంఘం యూత్ ఆధ్వర్యంలో బ్రదర్ పసలపూడి రత్నరాజు ఇరవై ఐదవ క్రీస్మస్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా “సాధనా స్వఛ్ఛంద సేవా సంస్థల అధినేతలు పసలపూడి సుజ్ఞాన కూమారి , గౌరవాధ్యక్షులు పసలపూడి వెంకటరత్నం , తూర్పు గోదావరి పాష్టర్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు డా: కె.మోజేష్ బాబు ,బ్రదర్ డా: రాజూజోషియా హజరయ్యారు. ఈ కార్యక్రమం పసలపూడి వెంకటరత్నం అధ్యక్షత నడిపించారు. మోజేష్ బాబు మాట్లాడుతూ యూదయ దేశపు బెత్లేహేము ,క్రీస్తు జన్మించిన స్థలమని బెత్లేహేము యొక్క చరిత్ర బైబిల్ మొదటి నుంచి క్రీస్తు జననం వరకు చరిత్రలో దాగివున్న మర్మం వివరించి బోధించారు. అనంతరం జోషీ రాజు క్రీస్మస్ సందేశం అందించారు.క్రీస్తు సంఘం యూత్ అతిధులను సాలువా , పూలమాలలు, మెమొంటోలుతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి పాటలు ,వాక్య సందేశాలు , చిన్న పిల్లలు కంఠత వాక్యాలు , క్రీస్మస్ నృత్యాలు తో దేవుని ఆరాధించారు. చిన్నపిల్లలుకు క్రీస్మస్ బహుమతులు కూడా అందజేశారు.ఈకార్యక్రమంలో పాష్టర్లు పసలపూడి సుందర రావు , సాల్మన్ రాజు, నేకూరి జాన్సన్, బ్రదర్ పసలపూడి రాజా , క్రీస్తు సంఘం ఆర్గనైజింగ్ యూత్ మంచెలి వీర్రాజు, మనెల్లి చిరంజీవి, రామవరపు నరేష్, చెరుకూరి చిన్నా( ప్రసాద్), ఉందుర్తి ఇస్సాకు, మద్దిపాటి రాజు ,మనెల్లి సుధీర్, కొక్కిరిపాటి బాను ,ముప్పిడి మహేష్ సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.