కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం, మాధవరం, రాంపురం, తుంగభద్ర, రచ్చమర్రి, చెట్నహాల్లి, కాగ్గల్, కల్లుదేవకుంట, వగరూరు, సూగూరు, మాలపల్లి సింగరాజనహాల్లి, తిమ్మపురం బూదూరు, చిలకలడోణ, గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. CSI, MB, చర్చిల్లో డివిజనల్ చైర్మన్ చిన్నబాబు, మాధవరం, తుంగభద్ర పాస్టర్లు రాజన్న, యేసయ్య లు శుక్రవారం తెల్లవారుజామున నుంచి ఇంటికి తిరిగి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు” అని బైబిల్ సందేశం చేశారు. సాయంత్రం అయా చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా చర్చిలను చూడముచ్చట గా అలంకరణ చేశారు. క్రిస్మస్ ట్రీ, యేసు జన్మించిన పశువుల పాక, ప్రత్యేకంగా నక్షత్రాలను విద్యుత్ దీపాల తో అలంకరించిన దృశ్యం ఆకట్టుకున్నాయి. శుభ దినం ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయా గ్రామాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు… ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రవి, ప్రభుదాస్, ఆదాము, యిర్మియా, డానియల్, అబ్రహం, సిల్వరాజు తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ V నరసింహులు.