రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని నిరుపేద అయినటువంటి వడ్ల బ్రహ్మచారి అనే వ్యక్తి గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటిని కోల్పోవడం జరిగింది.విషయం తెలుసుకున్న ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్న గారు తన ట్రస్ట్ ద్వారా ఇంటి నిర్మాణం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గృహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి కాంక్రీటు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అన్నగారితో పాటు సర్పంచ్ లలిత జ్యోతయ్య, పడకల్ ఎంపీటీసీ జోగు రమేష్ , అరవింద్ గుప్తా,వడ్ల రవి తదితరులు పాల్గొన్నారు.