Header Top logo

అదుపుతప్పి బైక్ బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానిక హైవే రోడ్డు నుండి చెరుకులపాడు గ్రామం మధ్యన ఆదివారం రాత్రి 7:50 నిమిషాల మధ్యన బైకు అదుపు తప్పి బోల్తా పడింది.బైక్ నడిపే వ్యక్తి పేరు ఉప్పరి స్వాములు వయసు 48 ఇతడు క్రిష్ణగిరి మండలం పుట్లూరు గ్రామానికి చెందిన గ్రామ నివాసి. ఇతడు వెల్దుర్తి నుండి పుట్లూరికి వెళ్లే దారి మధ్యలో హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరాన ఈ సంఘటన జరిగినది. వెంటనే సంఘటన దగ్గర గల వ్యక్తులు 108కి కాల్ చేయగా వెంటనే 108 సిబ్బంది స్పందించి పైలట్ ఉస్మాన్ భాష టెక్నీషియన్ లక్ష్మన్న కలిసి గాయాలు పడిన ఉప్పరి స్వాములికి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స చేసి తదుపరి ఇంకా మెరుగైన చికిత్స కొరకు కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి108 సిబ్బంది ఫైలెట్ ఉస్మాన్ భాష, టెక్నీషియన్ లక్మన్న కలిసి తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటున్న ప్రజానీకానికి అందుబాటులో ఉపయోగపడుతున్న 108 సిబ్బంది పైలెట్ ఉస్మాన్ భాష ,టెక్నీషియన్ లక్ష్మన్న కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలిపింది.ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking