Header Top logo

కదిరిలో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు — కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి

AP 39TV 13ఫిబ్రవరి 2021:

కదిరి పట్టణ పరిధిలో రూ22 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని వైయస్సార్ నగర్ లో రూ 33 లక్షల తో పైప్ లైన్ నిర్మాణం పనులకు శనివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
కదిరి పట్టణంలో ప్రతి రోజు ప్రతి వీధికి మంచినీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.కనీసం రోజు మార్చి రోజైనా మంచినీరు అందించాలన్నది నా లక్ష్యం. పార్నపల్లి శాశ్వత మంచినీటి పథకానికి సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి మోటార్లు, ఫిల్టర్ బెడ్స్ ను కొత్తవి ఏర్పాటు చేశాం.పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈలోపు పలు వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణం, సిసి రోడ్లు, బిటి రోడ్లు ఏర్పాటు చేస్తాం. పట్టణంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో హెల్త్ సెంటర్ రూ 80 లక్షలతో నిర్మించబోతున్నాం. అలాగే రూ.2 కోట్ల తో అధునాతన వసతులతో స్మశాన వాటికలో మృతదేహాలను దహనం చేసేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నాం.. అని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే ప్రమీల, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking