|| Whether I will be there tomorrow || || రేపు నేనుంటానో లేదో ||
|| Whether I will be there tomorrow || Poetry
|| రేపు నేనుంటానో లేదో ||
మిత్రమా.!
తృణప్రాయమైన ఈ దేహానికి మరణమెప్పుడు తలుపు తట్టునో కదా..
నేను మరణించానని తెలిసాక నువ్వెంతగానో దు:ఖిస్తావు
అప్పుడు నిన్ను నేను చూడలేను కలువాలనుకున్న ప్రతి క్షణం కరిగిపోయిందని చింతిస్తావు
ఆ కలయికేదో ఈరోజే జరుగనీగుండెలోని బాధను కాస్తైనా విప్పుకుందాం
మనసు మనసుతో మాట్లాడుకోనిద్దాం
గతంలోకి జారిన నా దేహానికి పూలహారాన్ని అలంకరిస్తావుచూడలేని నాకు అదేమీ తెలియదుఅభిమానపూర్వకంగా అదేదో ఇప్పుడే అందించునీ వాత్సల్యానికి చిరునామాగా చూసుకుంటా
నా పార్థివ దేహాన్ని తలుచుకుంటూప్రశంసల జల్లులెన్నో కురిపిస్తావుజ్ఞాపకాల గురుతులను వల్లెవేస్తావునీ మృధు మధుర భాషణలు నేను వినలేను
ఆ అనుభవాన్ని ఆస్వాదించనూలేనునామీద నీకున్న ప్రేమను నిరాటంకంగా చూపించుఅవన్నీ ఈనాడే సంభాషించి నీ ప్రేమామృతాన్ని కురిపించు
తెలియక తప్పులేమైనా నేను చేసివుంటేతప్పించుకుపోయాడని తిట్టుకుంటావు
నిర్జీవినైన నాకు అణు మాత్రమైనా నీ మనసు గ్రహించే స్థితి ఉండదు
దూషణ తిరస్కారాలేమైనా నిన్నాహ్వానిస్తేఅవన్నీ భళ్ళున కుమ్మరించి వెల్తావులేదా తప్పులను మన్నించి మంచి మనసుతో మిన్నకుంటావు
చలన రహితమైన దేహంగా పడివున్న నేను అవన్నీ తెలుసుకోలేను
దూరం తెలియని ప్రయాణంలో నేనుంటానునువ్వేమో, నా దగ్గరికి చేరుకోలేవు
మిత్రమా..! తప్పొప్పులు బేరీజు వేయకు అన్నీ మరిచిపోకాలం పరిహాసమాడుతోంద.
క్షణాలన్నీ కూడబలుక్కుంటున్నాయివేగంగా,అతి వేగంగా రోజుల్ని మింగేస్తున్నాయి.
అందుకే ఎప్పుడో కాదుఈరోజే నన్ను కలుసుకో మనసు ముడి విప్పుకుందాంనాకు రేపుంటుందో లేదో తెలియదు..
మచ్చరాజమౌళి,దుబ్బాక
9059637442