Header Top logo

ఫార్వార్డ్ మెసేజ్ లపై కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్

  • గ్రూపుల్లో మెసేజ్ లు ఫార్వార్డ్ చేయడంపై పరిమితి
  • ఒక గ్రూపు కంటే మించి ఫార్వార్డ్ చేయడాన్ని నిరోధించే ఫీచర్
  • ఇకపై ఒక పర్యాయం మాత్రమే ఫార్వార్డ్
  • ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలో ఫీచర్
ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో మెసేజ్ లు ఫార్వార్డ్ చేయడంపై పరిమితి తీసుకువచ్చింది. ఇకపై గ్రూపులో ఫార్వార్డ్ మెసేజ్ లను ఒకసారికి మించి ఫార్వార్డ్ చేయడం కుదరదు. యూజర్లు ఫార్వార్డ్ మెసేజ్ లను ఒక గ్రూపు కంటే మించి ఇతర గ్రూపులకు ఫార్వార్డ్ చేయడాన్ని ఈ ఫీచర్ నిరోధిస్తుంది. 
గ్రూపుల్లో స్పామ్ మెసేజ్ లు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి వాట్సాప్ ఈ చర్యలు తీసుకుంది. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి కొందరు ఆండ్రాయిడ్ యూజర్లకు బీటా వెర్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking