Header Top logo

We will set up a library for Amma అమ్మ కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తాం..

We will set up a library for Amma
అమ్మ కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తాం..

ఔను.. అమ్మ కోరిక మేరకు లైబ్రరీని ఏర్పాటు చేస్వాం అంటున్నారు నాగబెల్లి జితేందర్ కుటుంబ సభ్యులు. కరోనా సృష్టించిన మరణహోమంలో తన కన్న తల్లి మరణించి అప్పుడే సంవత్సరం గడిసింది. 24 జనవరి 2022 నాడు తల్లి నాగబెల్లి రాజవ్వ ప్రధమ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థం మంచి పని చేయాలని నిర్ణయించారు.

అమ్మ-నానల స్పూర్తితో..

అమ్మ రాజవ్వ-నాన సత్యదేవ్ ల స్పూర్తితో ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు తనయుడు నాగబెల్లి జితేందర్. భారత దేశానికి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తన తండ్రి సత్యదేవ్ చేసిన నిస్వార్థ సేవాలను మరిచి పోలేంటారు ఆయన. 1942లో ఆర్య సమాజ్ లో ముందుండి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడని గుర్తు చేశారు.

ఆర్య సమాజ్ భవన్..

ఆర్య సమాజ్ భవనం.. ప్రజా పోరాటాలకు కేంద్రంగా నిలిసింది. గ్రామాభివృద్ది, విద్యావ్యాప్తి, సంస్కరణలకు, దసరా ఉత్సవాలకు, చర్చలకు వేధికగా నిలిచిందంటున్నారు నాగబెల్లి జితేందర్. కాలక్రమేణ శిథిలావస్థకు చేరిన ఆ ఆర్య సమాజ్ భవనంలో తన తల్లి రాజవ్వ కోరిక మేరకు గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా గ్రంథాలయం ప్రారంభోత్సవం జరుపుకుంటామంటున్నారు జితేందర్. We will set up a library for Amma

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking